Display Topic


The lowest part of a building, and on which it rests

లూకా 14:29 – చూచుకొననియెడల అతడు దాని పునాది వేసి, ఒకవేళ దానిని కొనసాగింపలేక పోయినందున

అపోస్తలులకార్యములు 16:26 – అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను.

Figuratively applied to

-the heavens

2సమూయేలు 22:8 – అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.

-the earth

యోబు 38:4 – నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడనుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.

కీర్తనలు 104:5 – భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.

-the world

కీర్తనలు 18:15 – యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను.

మత్తయి 13:35 – అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.

-the Mountains

ద్వితియోపదేశాకాండము 32:22 – నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.

-the ocean

కీర్తనలు 104:8 – నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.

-kingdoms

నిర్గమకాండము 9:18 – ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను; ఐగుపు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.

Laid for

-Cities

యెహోషువ 6:26 – ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెనుఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును; వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును; దాని తలుపులను నిలువ నెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును;

1రాజులు 16:34 – అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను.

-walls

ఎజ్రా 4:12 – తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు.

ప్రకటన 21:14 – ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులు గలది, ఆ పునాదుల పైన గొఱ్ఱపిల్ల యొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.

-houses

లూకా 6:48 – వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను.

-temples

1రాజులు 6:37 – నాలుగవ సంవత్సరము జీప్‌ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను;

ఎజ్రా 3:10 – శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి

-towers

లూకా 14:28 – మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరినయెడల దానిని కొనసాగించుటకు కావలసినది తనయొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా?

లూకా 14:29 – చూచుకొననియెడల అతడు దాని పునాది వేసి, ఒకవేళ దానిని కొనసాగింపలేక పోయినందున

Described as

-of stone

1రాజులు 5:17 – రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కినరాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.

-deep laid

లూకా 6:48 – వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను.

-Strongly laid

ఎజ్రా 6:3 – రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమునుగూర్చి నిర్ణయించినది బలులు అర్పింపతగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను; దాని పునాదులు గట్టిగా వేయబడవలెను; దాని నిడివి అరువది మూరలును దాని వెడల్పు అరువది మూరలును ఉండవలెను;

-Joined together by corner stones

ఎజ్రా 4:12 – తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు.

1పేతురు 2:6 – ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

ఎఫెసీయులకు 2:20 – క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

Security afforded by

మత్తయి 7:25 – వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

లూకా 6:48 – వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను.

Illustrative of

-Christ

యెషయా 28:16 – ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియై యున్నది విశ్వసించువాడు కలవరపడడు.

1కొరిందీయులకు 3:11 – వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.

– Doctrines of the apostles, &c

ఎఫెసీయులకు 2:20 – క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

-First principles of the gospel

హెబ్రీయులకు 6:1 – కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు,

హెబ్రీయులకు 6:2 – దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములనుగూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము.

-decrees and purposes of God

2తిమోతి 2:19 – అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునది

-magistrates

కీర్తనలు 82:5 – జనులకు తెలివిలేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి.

-the Righteous

సామెతలు 10:25 – సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.

-hope of Saints

కీర్తనలు 87:1 – ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతములమీద వేయబడియున్నది

– Security of saints’ inheritance

హెబ్రీయులకు 11:10 – ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.