Display Topic


Idolaters guilty of

1సమూయేలు 8:8 – వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటినుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.

1రాజులు 11:33 – అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును.

The wicked guilty of

ద్వితియోపదేశాకాండము 28:20 – నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.

Backsliders guilty of

యిర్మియా 15:6 – యెహోవా వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించియున్నావు వెనుకతీసియున్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను; సంతాపపడి పడి నేను విసికియున్నాను.

Is forsaking

-His house

2దినవృత్తాంతములు 29:6 – మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యముచేసిరి.

-His covenant

ద్వితియోపదేశాకాండము 29:25 – మరియు వారు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి

1రాజులు 19:10 – అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒకడనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవిచేసెను.

యిర్మియా 22:9 – అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.

దానియేలు 11:30 – అంతట కిత్తీయుల ఓడలు అతని మీదికి వచ్చుటవలన అతడు వ్యాకులపడి మరలి, పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహము గలవాడై, తన యిష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును.

-His commandments

ఎజ్రా 9:10 – మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతివిు గదా.

-the right way

2పేతురు 2:15 – తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.

Trusting in man is

యిర్మియా 17:5 – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.

Leads men to follow their own devices

యిర్మియా 2:13 – నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.

Prosperity tempts to

ద్వితియోపదేశాకాండము 31:20 – నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారు తిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతలతట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు.

ద్వితియోపదేశాకాండము 32:15 – యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణశైలమును తృణీకరించెను.

Wickedness of

యిర్మియా 2:13 – నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.

యిర్మియా 5:7 – నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించుదును?

Unreasonableness and ingratitude of

యిర్మియా 2:5 – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగిపోయిరి?

యిర్మియా 2:6 – ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడనున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు.

Brings confusion

యిర్మియా 17:13 – ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.

Followed by remorse

యెహెజ్కేలు 6:9 – మరియు నన్ను విసర్జించినవారి విశ్వాస ఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయకృత్యములన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు

Brings down his wrath

ఎజ్రా 8:22 – మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించువారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను.

Provokes God to forsake men

న్యాయాధిపతులు 10:13 – అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షిం పను.

2దినవృత్తాంతములు 15:2 – ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును,

2దినవృత్తాంతములు 24:20 – అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.

2దినవృత్తాంతములు 24:24 – సిరియనులు చిన్నదండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారిచేతికి అతివిస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను.

Resolve against

యెహోషువ 24:16 – అందుకు ప్రజలుయెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము శాప గ్రస్తుల మగుదుము గాక.

నెహెమ్యా 10:29 – వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.

నెహెమ్యా 10:30 – మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు

నెహెమ్యా 10:31 – దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజనపదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతిదినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందుమనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి.

నెహెమ్యా 10:32 – మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.

నెహెమ్యా 10:33 – సవరింపబడిన రొట్టె విషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతిదినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.

నెహెమ్యా 10:34 – మరియు మా పితరుల యింటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింపజేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లు వేసికొని నిర్ణయించుకొంటిమి.

నెహెమ్యా 10:35 – మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను, ప్రతి సవంత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి

నెహెమ్యా 10:36 – మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.

నెహెమ్యా 10:37 – ఇదియు గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకలవిధమైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకులయొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.

నెహెమ్యా 10:38 – లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండవలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,

నెహెమ్యా 10:39 – ఇశ్రాయేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వారపాలకులును గాయకులును వాటిని తీసికొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.

Curse pronounced upon

యిర్మియా 17:5 – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.

Sin of, to be confessed

ఎజ్రా 9:10 – మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతివిు గదా.

Warnings against

యెహోషువ 24:20 – మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించినయెడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడుచేసి మిమ్మును క్షీణింప జేయుననగా

1దినవృత్తాంతములు 28:9 – సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.

Punishment of

ద్వితియోపదేశాకాండము 28:20 – నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.

2రాజులు 22:16 – యెహోవా సెలవిచ్చునదేమనగా యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని రప్పింతును.

2రాజులు 22:17 – ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొనుచున్నది.

యెషయా 1:28 – అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.

యిర్మియా 1:16 – అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి, తమచేతులు రూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనమంతటినిబట్టి నేను వారినిగూర్చిన నా తీర్పులు ప్రకటింతును.

యిర్మియా 5:19 – మన దేవుడైన యెహోవా దేనినిబట్టి ఇవన్నియు మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఈలాగనుము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందుకు, మీదికాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

Exemplified

-Children of Israel

1సమూయేలు 12:10 – అంతట వారు మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను అష్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితివిు; మా శత్రువుల చేతిలోనుండి నీవు మమ్మును విడిపించినయెడల మేము నిన్ను సేవించెదమని యెహోవాకు మొఱ్ఱపెట్టగా

-Saul

1సమూయేలు 15:11 – సౌలు నన్ను అనుసరింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను.

-Ahab

1రాజులు 18:18 – అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు.

-Amon

2రాజులు 21:22 – తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను.

-kingdom of Judah

2దినవృత్తాంతములు 12:1 – రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి.

2దినవృత్తాంతములు 12:5 – ప్రవక్తయైన షెమయా రెహబామునొద్దకును, షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతులయొద్దకును వచ్చి మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకుచేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.

2దినవృత్తాంతములు 21:10 – కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతిక్రిందనుండి తిరుగబడెను.

యెషయా 1:4 – పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించియున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయియున్నారు.

యిర్మియా 15:6 – యెహోవా వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించియున్నావు వెనుకతీసియున్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను; సంతాపపడి పడి నేను విసికియున్నాను.

-kingdom of Israel

2దినవృత్తాంతములు 13:11 – వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.

2రాజులు 17:7 – ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండియు, ఐగుప్తు రాజైన ఫరోయొక్క బలముక్రిందనుండియు, తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపముచేసి యితర దేవతలయందు భయభక్తులు నిలిపి

2రాజులు 17:8 – తమయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి.

2రాజులు 17:9 – మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములు గల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని

2రాజులు 17:10 – యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతాస్తంభములను నిలిపి

2రాజులు 17:11 – తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనుల వాడుకచొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి

2రాజులు 17:12 – చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి.

2రాజులు 17:13 – అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,

2రాజులు 17:14 – వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.

2రాజులు 17:15 – వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను,ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులైవారి వాడుకలచొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.

2రాజులు 17:16 – వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి.

2రాజులు 17:17 – మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.

2రాజులు 17:18 – కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టెను గనుక యూదా గోత్రము గాక మరి యే గోత్రమును శేషించి యుండలేదు.

-many disciples

యోహాను 6:66 – అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.

– Phygellus, &c

2తిమోతి 1:15 – ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు.

-Balaam

2పేతురు 2:15 – తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.