Display Topic


A characteristic of the wicked

సామెతలు 2:17 – అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది.

యెషయా 65:11 – యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు

Backsliders are guilty of

యిర్మియా 3:21 – ఆలకించుడి, చెట్లులేని మెట్టలమీద ఒక స్వరము వినబడుచున్నది; ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచినదానినిబట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి.

యిర్మియా 3:22 – భ్రష్టులైన బిడ్డలారా, తిరిగిరండి; మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; నీవే మా దేవుడవైన యెహోవావు, నీయొద్దకే మేము వచ్చుచున్నాము,

Is forgetting his

-covenant

ద్వితియోపదేశాకాండము 4:23 – మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను.

2రాజులు 17:38 – నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను.

-works

కీర్తనలు 78:7 – మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును

కీర్తనలు 78:11 – ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మరచిపోయిరి.

కీర్తనలు 106:13 – అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.

-Benefits

కీర్తనలు 103:2 – నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము

కీర్తనలు 106:7 – ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి.

-word

హెబ్రీయులకు 12:5 – మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము

యాకోబు 1:25 – అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.

-law

కీర్తనలు 119:153 – (రేష్‌) నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము

కీర్తనలు 119:176 – తప్పిపోయిన గొఱ్ఱవలె నేను త్రోవవిడిచి తిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.

హోషేయ 4:6 – నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.

-Past deliverance

న్యాయాధిపతులు 8:34 – మరల బయలుల ననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసికొనిరి.

కీర్తనలు 78:42 – ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.

-Power to deliver

యెషయా 51:13 – బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?

యెషయా 51:14 – క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు.

యెషయా 51:15 – నేను నీ దేవుడనైన యెహోవాను సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

Encouraged by false teachers

యిర్మియా 23:27 – బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా?

Prosperity often leads to

ద్వితియోపదేశాకాండము 8:12 – మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా,

ద్వితియోపదేశాకాండము 8:13 – నీ పశువులు నీ గొఱ్ఱమేకలును వృద్ధియై నీకు వెండిబంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్థిల్లినప్పుడు

ద్వితియోపదేశాకాండము 8:14 – నీ మనస్సు మదించి, దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో.

హోషేయ 13:6 – తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.

Trials should not lead to

కీర్తనలు 44:17 – ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.

కీర్తనలు 44:18 – మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.

కీర్తనలు 44:19 – అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు

కీర్తనలు 44:20 – మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మాచేతులు చాపియున్నయెడల

Resolve against

కీర్తనలు 119:16 – నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.

కీర్తనలు 119:93 – నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను.

Cautions against

ద్వితియోపదేశాకాండము 6:12 – దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము.

ద్వితియోపదేశాకాండము 8:11 – నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని

Exhortation to those guilty of

కీర్తనలు 50:22 – దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించువాడెవడును లేకపోవును

Punishment of

యోబు 8:12 – అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును.

యోబు 8:13 – దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.

కీర్తనలు 9:17 – దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు.

యెషయా 17:10 – ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొనలేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి

యెషయా 17:11 – నీవు నాటిన దినమున దాని చుట్టు కంచె వేసితివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును.

యెహెజ్కేలు 23:35 – ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు.

హోషేయ 8:14 – ఇశ్రాయేలువారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు; యూదావారు ప్రాకారములుగల పట్టణములను చాల కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును.