Display Topic
Wild in fields
కీర్తనలు 103:15 – నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవిపువ్వు పూయునట్లు వాడు పూయును.
Cultivated in gardens
పరమగీతము 6:2 – ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను.
పరమగీతము 6:3 – నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు.
Described as
-beautiful
మత్తయి 6:29 – అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.
-Sweet
పరమగీతము 5:13 – అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.
-Evanescent
కీర్తనలు 103:16 – దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.
యెషయా 40:8 – గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.
-Appear in spring
పరమగీతము 2:12 – దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలముచేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
Mentioned in scripture
-the lily
హోషేయ 14:5 – చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామరపుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధినొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు.
మత్తయి 6:28 – వస్త్రములనుగూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగునెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు
-the lily of the valley
పరమగీతము 2:1 – నేను షారోను పొలములో పూయు పుష్పమువంటిదానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను.
-the rose
యెషయా 35:1 – అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పమువలె పూయును
-the rose of Sharon
పరమగీతము 2:1 – నేను షారోను పొలములో పూయు పుష్పమువంటిదానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను.
-of the Grass
1పేతురు 1:24 – గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
Garlands of, used in worship of idols
అపోస్తలులకార్యములు 14:13 – పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను.
Representations of, on the
-golden candlestick
నిర్గమకాండము 25:31 – మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషిపనిగా చేయవలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై యుండవలెను.
నిర్గమకాండము 25:33 – ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను.
2దినవృత్తాంతములు 4:21 – పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను.
-sea of Brass
1రాజులు 7:26 – అది బెత్తెడు దళసరిగలదై యుండెను; దాని పై అంచు పాత్రకు పై అంచువలె తామర పుష్పములవంటి పని కలిగి యుండెను; అది తొమ్మిది గరిసెలు పట్టును.
2దినవృత్తాంతములు 4:5 – అది బెత్తెడు దళముగలది, దాని అంచు గిన్నెయంచువంటిదై తామర పుష్పములు తేల్చబడియుండెను; అది ముప్పది పుట్ల నీళ్లు పట్టును.
-wood Work of the temple
1రాజులు 6:18 – మందిరము లోపలనున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడియుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి యొకటైన కనబడలేదు.
1రాజులు 6:29 – మరియు మందిరపు గోడలన్నిటిమీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను.
1రాజులు 6:33 – మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడ వెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను.
1రాజులు 6:35 – వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొదిగించెను.
Illustrative of
-the graces of Christ
పరమగీతము 5:13 – అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.
– Shortness of man’s life
యోబు 14:2 – పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.
కీర్తనలు 103:15 – నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవిపువ్వు పూయునట్లు వాడు పూయును.
-kingdom of Israel
యెషయా 28:1 – త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పమువంటి వారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ.
-glory of Man
1పేతురు 1:24 – గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
-rich Men
యాకోబు 1:10 – ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
యాకోబు 1:11 – సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.