Display Topic


Necessary members of the body

1కొరిందీయులకు 12:15 – నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

1కొరిందీయులకు 12:21 – గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.

Parts of, mentioned in scripture

-Heel

కీర్తనలు 41:9 – నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజనము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను

కీర్తనలు 49:5 – నాకొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను?

హోషేయ 12:3 – తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను.

-sole

ద్వితియోపదేశాకాండము 11:24 – మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.

1రాజులు 5:3 – యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచువరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.

-Toes

నిర్గమకాండము 29:20 – ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి, ఆహరోను కుడిచెవి కొనమీదను అతని కుమారుల కుడి చెవుల కొనమీదను, వారి కుడిచేతి బొట్టన వ్రేళ్లమీదను, వారి కుడికాలి బొట్టనవ్రేళ్లమీదను చమిరి బలిపీఠముమీద చుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.

2సమూయేలు 21:20 – ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి యెత్తరి యొకడుండెను, ఒక్కొకచేతికి ఆరేసి వ్రేళ్లును, ఇరువది నాలుగు వ్రేళ్లు అతనికుండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు.

దానియేలు 2:41 – పాదములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగా నున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో ఆలాగున నుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును.

Often swift

2సమూయేలు 2:18 – సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషైయును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక

2సమూయేలు 22:34 – ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును.

Were liable to

-Disease

1రాజులు 15:23 – ఆసా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని బలమంతటినిగూర్చియు, అతడు చేసిన సమస్తమునుగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగము పుట్టెను.

-Swelling from Walking

ద్వితియోపదేశాకాండము 8:4 – ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.

– Injury from stones, &c

కీర్తనలు 91:12 – నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమచేతులమీద ఎత్తి పట్టుకొందురు

Early use of shoes

నిర్గమకాండము 12:11 – మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలుచేత పట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.

Of women often adorned with tingling ornaments

యెషయా 3:16 – మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించుచున్నారు;

యెషయా 3:18 – ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను

Of the Jews

-Neglected in Affliction

2సమూయేలు 19:24 – మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును నెదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగివచ్చిన నాటివరకు అతడు కాళ్లు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను.

యెహెజ్కేలు 24:17 – మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను, నీ పెదవులు మూసికొనవద్దు జనుల ఆహారము భుజింపవద్దు

-Bare in Affliction

2సమూయేలు 15:30 – అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలు లేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.

-Washed Frequently

2సమూయేలు 11:8 – తరువాత దావీదు ఇంటికిపోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజనగరిలోనుండి బయలువెళ్లెను.

పరమగీతము 5:3 – నేను వస్త్రము తీసివేసితిని నేను మరల దాని ధరింపనేల? నా పాదములు కడుగుకొంటిని నేను మరల వాటిని మురికి చేయనేల?

Stamped on the ground in extreme joy or grief

యెహెజ్కేలు 6:11 – ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీచేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలుదురు.

యెహెజ్కేలు 25:6 – మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేలతన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు

Washing for others, a menial office

1సమూయేలు 25:41 – ఆమె లేచి సాగిలపడి నా యేలినవాని చిత్తము; నా యేలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా యేలినవాని దాసురాలనగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి

యోహాను 13:5 – అంతట పళ్లెములో నీళ్లుపోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.

యోహాను 13:6 – ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.

యోహాను 13:7 – అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా

యోహాను 13:8 – పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.

యోహాను 13:9 – సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నాచేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను.

యోహాను 13:10 – యేసు అతని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.

యోహాను 13:11 – తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.

యోహాను 13:12 – వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?

యోహాను 13:13 – బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.

యోహాను 13:14 – కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.

Of strangers and travellers washed

ఆదికాండము 18:4 – నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగుకొని ఈ చెట్టుక్రింద అలసట తీర్చుకొనుడి.

ఆదికాండము 19:2 – నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి

ఆదికాండము 24:32 – ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి

1తిమోతి 5:10 – సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయము చేసి, ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.

Neglect of washing, disrespectful to guest

లూకా 7:44 – ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్యలేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను.

Respect exhibited by falling at

1సమూయేలు 25:24 – నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము;

2రాజులు 4:37 – అంతట ఆమె లోపలికివచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తికొనిపోయెను.

ఎస్తేరు 8:3 – మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవిచేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా

మార్కు 5:22 – ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీద పడి

అపోస్తలులకార్యములు 10:25 – పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీద పడి నమస్కారము చేసెను.

Reverence expressed by kissing

లూకా 7:38 – వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను.

లూకా 7:45 – నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు.

Sleep expressed by covering

1సమూయేలు 24:3 – మార్గముననున్న గొఱ్ఱదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక

Subjection expressed by licking the dust of

యెషయా 49:23 – రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.

Condemnation expressed by shaking the dust from

మత్తయి 10:14 – ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండినయెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.

మార్కు 6:11 – ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి.

Subjugation of enemies expressed by placing on their necks

యెహోషువ 10:24 – వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువయొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలి పించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతు లతోమీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి.

కీర్తనలు 110:1 – ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

Origin of uncovering in consecrated places

నిర్గమకాండము 3:5 – అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.

యెహోషువ 5:15 – అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసి వేయుమని యెహోషువతో చెప్పగా యెహో షువ ఆలాగు చేసెను.

Of enemies often maimed and cut off

న్యాయాధిపతులు 1:6 – అదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలుచేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి.

న్యాయాధిపతులు 1:7 – అప్పుడు అదోనీ బెజెకుతమ కాళ్లుచేతుల బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బదిమంది రాజులు నా భోజనపు బల్లక్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను.

2సమూయేలు 4:12 – సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి, దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారిచేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలనుదగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసికొనిపోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి.

Of criminals

-Bound with Fetters

కీర్తనలు 105:18 – వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.

-Placed in stocks

యోబు 13:27 – బొండలలో నా కాళ్లు బిగించియున్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ల చుట్టు గిఱిగీసియున్నావు

అపోస్తలులకార్యములు 16:24 – అతడు అట్టి ఆజ్ఞను పొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.

Path of, to be pondered

సామెతలు 4:26 – నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.

To be refrained from evil

సామెతలు 1:15 – నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.

హెబ్రీయులకు 12:13 – మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి.

To be turned to God’s testimonies

కీర్తనలు 119:59 – నా మార్గములు నేను పరిశీలన చేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని.

To be directed by God’s word

కీర్తనలు 119:105 – (నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైయున్నది.

To be guided by wisdom and discretion

సామెతలు 3:21 – నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము

సామెతలు 3:23 – అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.

సామెతలు 3:26 – యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.

Of the wicked

-Swift to mischief

సామెతలు 6:18 – దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును

-Swift to shed blood

సామెతలు 1:16 – కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.

రోమీయులకు 3:15 – రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.

-Ensnared

యోబు 18:8 – వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.

కీర్తనలు 9:15 – తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.

Of saints

-at liberty

కీర్తనలు 18:36 – నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.

కీర్తనలు 31:8 – నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.

-kept by God

1సమూయేలు 2:9 – తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.

కీర్తనలు 116:8 – మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.

-Established by God

కీర్తనలు 66:9 – జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు.

కీర్తనలు 121:3 – ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.

-Guided by Christ

యెషయా 48:17 – నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.

లూకా 1:79 – మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.

Illustrative

– (Set on a rock,) of stability

కీర్తనలు 40:2 – నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలోనుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను.

– (Set in a large place,) of liberty

కీర్తనలు 31:8 – నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.

– (Sliding,) of yielding to temptation

యోబు 12:5 – దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.

కీర్తనలు 17:5 – నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.

కీర్తనలు 38:16 – ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించకపోదురు గాక.

కీర్తనలు 94:18 – నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.

– (Treading under,) of complete destruction

యెషయా 18:7 – ఆ కాలమున ఎత్తయినవారును నునుపైన చర్మముగలవారును. దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు దేశము గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.

విలాపవాక్యములు 1:15 – నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులనందరిని కొట్టివేసెను నా యౌవనులను అణగద్రొక్కవలెనని ఆయన నామీద నియామకకూటము కూడను చాటించెను. యెహోవా కన్యకయైన యూదాకుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు.

– (Washed or dipped in oil,) of abundance

ద్వితియోపదేశాకాండము 33:24 – ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును.

యోబు 29:6 – నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను.

– (Dipped in blood,) of victory

కీర్తనలు 68:23 – వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు.