Display Topic


God condemns

ఆదికాండము 11:7 – గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.

యెషయా 5:8 – స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ.

Christ condemns

మత్తయి 18:1 – ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోకరాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా,

మత్తయి 18:3 – మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

మత్తయి 18:4 – కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.

మత్తయి 20:25 – గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును.

మత్తయి 20:26 – మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;

మత్తయి 23:11 – మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను.

మత్తయి 23:12 – తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.

Saints avoid

కీర్తనలు 131:1 – యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు నాకు అందనివాటి యందైనను గొప్పవాటి యందైనను నేను అభ్యాసము చేసికొనుటలేదు.

కీర్తనలు 131:2 – నేను నా ప్రాణమును నిమ్మళ పరచుకొనియున్నాను సముదాయించుకొని యున్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్ద నున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నాయొద్ద నున్నది.

Vanity of

యోబు 20:5 – ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?

యోబు 20:6 – వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను

యోబు 20:7 – తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు. వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.

యోబు 20:8 – కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.

యోబు 20:9 – వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు

యోబు 24:24 – వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.

కీర్తనలు 49:11 – వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.

కీర్తనలు 49:12 – ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు.

కీర్తనలు 49:13 – స్వాతిశయ పూర్ణులకును వారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.

కీర్తనలు 49:14 – వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియైయుండును ఉదయమున యథార్థవంతులు వారినేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును.

కీర్తనలు 49:15 – దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును.(సెలా.)

కీర్తనలు 49:16 – ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము.

కీర్తనలు 49:17 – వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు.

కీర్తనలు 49:18 – నీకు నీవే మేలు చేసికొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకొనినను

కీర్తనలు 49:19 – అతడు తన పితరుల తరమునకు టొరవలెను వారు మరి ఎన్నడును వెలుగుచూడరు.

కీర్తనలు 49:20 – ఘనత నొందియుండియు బుద్ధిహీనులైనవారు నశించు జంతువులను పోలియున్నారు.

Leads to strife and contention

యాకోబు 4:1 – మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?

యాకోబు 4:2 – మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియు దొరకదు.

Punishment of

సామెతలు 17:19 – కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు.

యెషయా 14:12 – తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

యెషయా 14:13 – నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

యెషయా 14:14 – మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

యెషయా 14:15 – నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

యెహెజ్కేలు 31:10 – కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ యెత్తునుబట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘములకంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్విం చెను.

యెహెజ్కేలు 31:11 – కాబట్టి యతని దుష్టత్వమునుబట్టి యతనిని తరిమివేసి, జనములలో బలముగల జనమునకు నేనతని నప్పగించెదను; ఆ జనము అతనికి తగినపని చేయును.

ఓబధ్యా 1:3 – అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండసందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగల వాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.

ఓబధ్యా 1:4 – పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రిందపడవేతును; ఇదే యెహోవా వాక్కు.

Connected with

-Pride

హబక్కూకు 2:5 – మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును.

-Covetousness

హబక్కూకు 2:8 – బహు జనముల ఆస్తిని నీవు కొల్లపెట్టియున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు బలాత్కారమును బట్టియు నిన్ను కొల్లపెట్టుదురు.

హబక్కూకు 2:9 – తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.

-Cruelty

హబక్కూకు 2:12 – నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించు వారికి శ్రమ.

Exemplified

-Adam and Eve

ఆదికాండము 3:5 – ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచిచెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా

ఆదికాండము 3:6 – స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;

-Builders of Babel

ఆదికాండము 11:4 – మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరముగల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా

-Miriam and Aaron

సంఖ్యాకాండము 12:2 – వారు మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మాచేతను పలికింపలేదా? అని చెప్పుకొనగా

– Korah, &c

సంఖ్యాకాండము 16:3 – మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారిమధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,

-Absalom

2సమూయేలు 15:4 – నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడువారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను.

2సమూయేలు 18:18 – తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షాలోము తాను బ్రదికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటివరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు.

-Adonijah

1రాజులు 1:5 – హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించినవాడై నేనే రాజునగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్పరచుకొనెను.

-Sennacherib

2రాజులు 19:23 – ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా.నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను.

-Shebna

యెషయా 22:16 – ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు

-Sons of Zebedee

మత్తయి 20:21 – నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.

-Antichrist

2దెస్సలోనీకయులకు 2:4 – ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.

-Diotrephes

3యోహాను 1:9 – నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు.