Display Topic


Held first day of the month

సంఖ్యాకాండము 10:10 – మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలులనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.

Celebrated with blowing of trumpets

సంఖ్యాకాండము 10:10 – మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలులనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.

కీర్తనలు 81:3 – అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి.

కీర్తనలు 81:4 – అది ఇశ్రాయేలీయులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము.

Sacrifices at

సంఖ్యాకాండము 28:11 – నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,

సంఖ్యాకాండము 28:12 – నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవవంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయవలెను.

సంఖ్యాకాండము 28:13 – అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలి.

సంఖ్యాకాండము 28:14 – వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱపిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి.

సంఖ్యాకాండము 28:15 – నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేకపిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింపవలెను.

A season for

– Inquiring of God’s messengers

2రాజులు 4:23 – అతడు నేడు అమావాస్య కాదే; విశ్రాంతిదినము కాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి

– Worship in God’s house

యెషయా 66:23 – ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెహెజ్కేలు 46:1 – ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పుతట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతిదినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను.

-Entertainments

1సమూయేలు 20:5 – అందుకు దావీదు రేపటిదినము అమావాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.

1సమూయేలు 20:18 – మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను రేపటిదినము అమావాస్య; నీ స్థలము ఖాళిగా కనబడును గదా;

Observed with great solemnity

1దినవృత్తాంతములు 23:31 – సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.

2దినవృత్తాంతములు 2:4 – నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములయందును, విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామ ఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.

2దినవృత్తాంతములు 8:13 – మోషే యిచ్చిన ఆజ్ఞనుబట్టి విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, నియామక కాలములయందును, సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగలయందును, అనగా పులియని రొట్టెల పండుగయందును వారముల పండుగయందును పర్ణశాలల పండుగయందును యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చెను.

2దినవృత్తాంతములు 31:3 – మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న విధినిబట్టి జరుగు ఉదయాస్తమయముల దహనబలులను విశ్రాంతిదినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడియున్న దహనబలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండి రాజు ఒక భాగమును ఏర్పాటుచేసెను.

Restored after captivity

ఎజ్రా 3:5 – తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి.

నెహెమ్యా 10:33 – సవరింపబడిన రొట్టె విషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతిదినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.

Mere outward observance of, hateful to God

యెషయా 1:13 – మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దానినికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చజాలను.

యెషయా 1:14 – మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలములును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

Disliked by the ungodly

ఆమోసు 8:5 – తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొనువారలారా,

The Jews deprived of, for sin

హోషేయ 2:11 – దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతిదినములను నియామకకాలములను మాన్పింతును.

Observance of, by Christians, condemned

కొలొస్సయులకు 2:16 – కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పుతీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.

గలతీయులకు 4:10 – మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.