Display Topic


A characteristic of the wicked

ప్రకటన 21:8 – పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

Is described as

-A fear of idols

2రాజులు 17:38 – నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను.

-A fear of Man

1సమూయేలు 15:24 – సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని.

యోహాను 9:22 – వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలివేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి.

-A fear of judgments

యెషయా 2:19 – యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.

లూకా 21:26 – ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకముమీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.

ప్రకటన 6:16 – బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్నవాని యొక్కయు గొఱ్ఱపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?

ప్రకటన 6:17 – మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు.

-A fear of future Punishment

హెబ్రీయులకు 10:27 – న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.

-Overwhelming

నిర్గమకాండము 15:16 – యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.

యోబు 15:21 – భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వానిమీదికి వచ్చెదరు.

యోబు 15:24 – శ్రమయు వేదనయు వానిని బెదరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనునట్లు అవి వానిని పట్టుకొనును.

-Consuming

కీర్తనలు 73:19 – క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.

A guilty conscience leads to

ఆదికాండము 3:8 – చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్లమధ్యను దాగుకొనగా

ఆదికాండము 3:10 – అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.

కీర్తనలు 53:5 – భయకారణము లేనిచోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడివేయువారి యెముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి.

సామెతలు 28:1 – ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.

Seizes the wicked

యోబు 15:24 – శ్రమయు వేదనయు వానిని బెదరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనునట్లు అవి వానిని పట్టుకొనును.

యోబు 18:11 – నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును భయములు వారిని వెంటాడి తరుమును.

Surprises the hypocrite

యెషయా 33:14 – సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును?

యెషయా 33:18 – నీ హృదయము భయంకరమైనవాటినిబట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు?

The wicked judicially filled with

లేవీయకాండము 26:16 – నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు;

లేవీయకాండము 26:17 – నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.

ద్వితియోపదేశాకాండము 28:65 – ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయకంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును.

ద్వితియోపదేశాకాండము 28:66 – నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగియుండును.

ద్వితియోపదేశాకాండము 28:67 – నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.

యిర్మియా 49:5 – నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని, నీవేల నీ లోయలనుగూర్చి యతిశయించుచున్నావు? ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

Shall be realised

సామెతలు 1:27 – భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.

సామెతలు 10:24 – భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.

God mocks

సామెతలు 1:26 – కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను

Saints sometimes tempted to

కీర్తనలు 55:5 – దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను.

Saints delivered from

సామెతలు 1:33 – నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.

యెషయా 14:3 – తమ్మును బాధించినవారిని ఏలుదురు.

Trust in God, a preservative from

కీర్తనలు 27:1 – యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?

Exhortations against

యెషయా 8:12 – ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.

యోహాను 14:27 – శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.

Exemplified

-Adam

ఆదికాండము 3:10 – అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.

-Cain

ఆదికాండము 4:14 – నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినైయుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.

-Midianites

న్యాయాధిపతులు 7:21 – వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టు నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి.

న్యాయాధిపతులు 7:22 – ఆ మూడువందలమంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతువైపున నున్న బేత్షిత్తావరకు తబ్బాతునొద్ద నున్న ఆబేల్మెహోలా తీరమువరకు పారిపోగా

-Philistines

1సమూయేలు 14:15 – దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.

-Saul

1సమూయేలు 28:5 – సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది

1సమూయేలు 28:20 – సమూయేలు మాటలకు సౌలు బహు భయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమియు చేయక యుండినందున బలహీనుడాయెను.

– Adonijah’s guests

1రాజులు 1:49 – అందుకు అదోనీయా పిలిచినవారు భయపడి లేచి తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.

-Haman

ఎస్తేరు 7:6 – ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి యెదుటను భయాక్రాంతుడాయెను.

-Ahaz

యెషయా 7:2 – అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడుచేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవిచెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను.

-Belshazzar

దానియేలు 5:6 – అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.

-Pilate

యోహాను 19:8 – పిలాతు ఆ మాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి

-Felix

అపోస్తలులకార్యములు 24:25 – అప్పుడతడు నీతినిగూర్చియు ఆశానిగ్రహమునుగూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను