Display Topic

Spirit of, explained

యెషయా 58:6 – దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

యెషయా 58:7 – నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్తసంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

Not to be made a subject of display

మత్తయి 6:16 – మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 6:17 – ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.

మత్తయి 6:18 – అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.

Should be to God

జెకర్యా 7:5 – దేశపు జనులందరికిని యాజకులకును నీవీమాట తెలియజేయవలెను. ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేట అయిదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు, నాయందు భక్తికలిగియే ఉపవాసముంటిరా?

మత్తయి 6:18 – అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.

For the chastening of the soul

కీర్తనలు 69:10 – ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను.

For the humbling of the soul

కీర్తనలు 35:13 – వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చియున్నది.

Observed on occasions of

-judgments of God

యోవేలు 1:14 – ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.

యోవేలు 2:12 – ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

-public calamities

2సమూయేలు 1:12 – సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారినిగూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి.

-afflictions of the Church

లూకా 5:33 – వారాయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు; ఆలాగే పరిసయ్యుల శిష్యులును చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి.

లూకా 5:34 – అందుకు యేసు పెండ్లికుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటివారిచేత మీరు ఉపవాసము చేయింపగలరా?

లూకా 5:35 – పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను.

-afflictions of others

కీర్తనలు 35:13 – వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చియున్నది.

దానియేలు 6:18 – అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగనియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.

-Private afflictions

2సమూయేలు 12:16 – యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.

-Approaching danger

ఎస్తేరు 4:16 – నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.

-Ordination of Ministers

అపోస్తలులకార్యములు 13:3 – అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.

అపోస్తలులకార్యములు 14:23 – మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.

Accompanied by

-prayer

ఎజ్రా 8:23 – మేము ఉపవాసముండి ఆ సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను

దానియేలు 9:3 – అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసికొంటిని.

-Confession of Sin

1సమూయేలు 7:6 – వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను.

నెహెమ్యా 9:1 – ఈ నెల యిరువది నాలుగవ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తలమీద ధూళి పోసికొని కూడి వచ్చిరి.

నెహెమ్యా 9:2 – ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి,తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి.

-Mourning

యోవేలు 2:12 – ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

-Humiliation

ద్వితియోపదేశాకాండము 9:18 – మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపములవలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి, మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని.

నెహెమ్యా 9:1 – ఈ నెల యిరువది నాలుగవ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తలమీద ధూళి పోసికొని కూడి వచ్చిరి.

Promises connected with

యెషయా 58:8 – వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువచుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

యెషయా 58:9 – అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని

యెషయా 58:10 – ఆశించినదానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.

యెషయా 58:11 – యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును నీవు నీరుకట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.

యెషయా 58:12 – పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.

మత్తయి 6:18 – అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.

Of hypocrites

-Described

యెషయా 58:4 – మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు.

యెషయా 58:5 – అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా?

-Ostentatious

మత్తయి 6:16 – మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

-Boasted of, before God

లూకా 18:12 – వారమునకు రెండుమారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను.

-Rejected

యెషయా 58:3 – మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు

యిర్మియా 14:12 – వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొఱ్ఱను వినను; వారు దహనబలియైనను నైవేద్యమైనను అర్పించునప్పుడు నేను వాటిని అంగీకరింపను; ఖడ్గమువలనను క్షామమువలనను తెగులువలనను వారిని నాశము చేసెదను

Extraordinary Exemplified

-Our Lord

మత్తయి 4:2 – నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా

-Moses

నిర్గమకాండము 34:28 – అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను

ద్వితియోపదేశాకాండము 9:9 – ఆ రాతిపలకలు, అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసికొనుటకు నేను కొండెక్కినప్పుడు, అన్నపానములు మాని ఆ కొండమీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని.

ద్వితియోపదేశాకాండము 9:18 – మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపములవలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి, మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని.

-Elijah

1రాజులు 19:8 – అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి

National Exemplified

-Israel

న్యాయాధిపతులు 20:26 – వీరందరు కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరును జనులందరును పోయి, బేతేలును ప్రవేశించి యేడ్చుచు సాయంకాలమువరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధాన బలులను యెహో వా సన్నిధిని అర్పించిరి.

ఎజ్రా 8:21 – అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని.

ఎస్తేరు 4:3 – రాజుయొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి, ఆనేకులు గోనెను బూడిదెను వేసికొని పడియుండిరి.

ఎస్తేరు 4:16 – నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.

యిర్మియా 36:9 – యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు అయిదవ సంవత్సరము తొమ్మిదవ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరును యూదా పట్టణములలోనుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరును యెహోవా పేరట ఉపవాసము చాటింపగా

-Men of Jabesh-gilead

1సమూయేలు 31:13 – వారి శల్యములను తీసి యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి.

-Ninevites

యోనా 3:5 – నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాసదినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి.

యోనా 3:6 – ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను.

యోనా 3:7 – మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా

యోనా 3:8 – ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పు కొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులుగాని యెద్దులుగాని గొఱ్ఱలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు,

Of Saints Exemplified

-David

2సమూయేలు 12:16 – యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.

కీర్తనలు 109:24 – ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను.

-Nehemiah

నెహెమ్యా 1:4 – ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.

-Esther

ఎస్తేరు 4:16 – నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.

-Daniel

దానియేలు 9:3 – అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసికొంటిని.

-disciples of John

మత్తయి 9:14 – అప్పుడు యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చి పరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా

-Anna

లూకా 2:37 – యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవ చేయుచుండెను.

-Cornelius

అపోస్తలులకార్యములు 10:30 – అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలుకొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యెదుట నిలిచి

-Christians

అపోస్తలులకార్యములు 13:2 – వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను.

-Apostles

2కొరిందీయులకు 6:5 – శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,

-Paul

2కొరిందీయులకు 11:27 – ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలిదప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.

Of the wicked-Exemplified

-elders of Jezreel

1రాజులు 21:12 – ఎట్లనగా వారు ఉపవాసదినము చాటించి నాబోతును జనులయెదుట నిలువబెట్టిరి.

-Ahab

1రాజులు 21:27 – అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి, గోనెపట్టమీద పరుండి వ్యాకులపడుచుండగా

-Pharisees

మార్కు 2:18 – యోహాను శిష్యులును పరిసయ్యులును ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులును పరిసయ్యుల శిష్యులును ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయన నడుగగా

లూకా 18:12 – వారమునకు రెండుమారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను.