Display Topic


A characteristic of saints

ఎఫెసీయులకు 1:1 – దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వా సులునైనవారికి శుభమని చెప్పి వ్రాయునది

కొలొస్సయులకు 1:2 – దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

1తిమోతి 6:2 – విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము.

ప్రకటన 17:14 – వీరు గొఱ్ఱపిల్లతో యుద్ధముచేతురు గాని, గొఱ్ఱపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతో కూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

Exhibited in

-the service of God

మత్తయి 24:45 – యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?

-Declaring the word of God

యిర్మియా 23:28 – కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.

2కొరిందీయులకు 2:17 – కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవుని యెదుట బోధించుచున్నాము.

2కొరిందీయులకు 4:2 – అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము

-the care of dedicated things

2దినవృత్తాంతములు 31:12 – వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయుడైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింపబడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను.

-Helping the brethren

3యోహాను 1:5 – ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు.

-bearing witness

సామెతలు 14:5 – నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.

-Reproving others

సామెతలు 27:6 – మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.

కీర్తనలు 141:5 – నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను.

-situations of Trust

2రాజులు 12:15 – మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనినవారు నమ్మకస్థులని వారిచేత లెక్క అడుగలేదు.

నెహెమ్యా 13:13 – నమ్మకముగల మనుష్యులని పేరుపొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారిచేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను.

అపోస్తలులకార్యములు 6:1 – ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.

అపోస్తలులకార్యములు 6:2 – అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు.

అపోస్తలులకార్యములు 6:3 – కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;

-Doing Work

2దినవృత్తాంతములు 34:12 – ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా, మెరారీయులైన లేవీయులగు యహతు ఓబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జెకర్యా మెషుల్లాము అనువారును, లేవీయులలో వాద్య ప్రవీణులైన వారు వారితోకూడ ఉండిరి.

-Keeping secrets

సామెతలు 11:13 – కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును.

-Conveying messages

సామెతలు 13:17 – దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు.

సామెతలు 25:13 – నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచుచల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును.

-all things

1తిమోతి 3:11 – అటువలె పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.

-the smallest matters

లూకా 16:10 – మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.

లూకా 16:11 – కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?

లూకా 16:12 – మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును?

Should be to death

ప్రకటన 2:10 – ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.

Especially required in

-Ministers

1కొరిందీయులకు 4:2 – మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడైయుండుట అవశ్యము.

2తిమోతి 2:2 – నీవు అనేక సాక్షుల యెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము,

-the wives of Ministers

1తిమోతి 3:11 – అటువలె పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.

-the Children of Ministers

తీతుకు 1:6 – ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును.

Difficulty of finding

సామెతలు 20:6 – దయచూపు వానిని కలిసికొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?

The wicked devoid of

కీర్తనలు 5:9 – వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు.

Associate with those who exhibit

కీర్తనలు 101:6 – నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు.

Blessedness of

1సమూయేలు 26:23 – యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందినవానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును.

సామెతలు 28:20 – నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు.

Blessedness of, illustrated

మత్తయి 24:45 – యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?

మత్తయి 24:46 – యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.

మత్తయి 25:21 – అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను

మత్తయి 25:23 – అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను

Exemplified

-Joseph

ఆదికాండము 39:22 – చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరిని యోసేపుచేతికప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు.

ఆదికాండము 39:23 – యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనిచేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణ చేయక యుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.

-Moses

సంఖ్యాకాండము 12:7 – అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.

హెబ్రీయులకు 3:2 – దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయన కూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.

హెబ్రీయులకు 3:5 – ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.

-David

1సమూయేలు 22:14 – అహీమెలెకు రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు?

-Hananiah

నెహెమ్యా 7:2 – నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవుని యెదుట భయభక్తులు గలవాడు.

-Abraham

నెహెమ్యా 9:8 – అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు ఆతనితో నిబంధన చేసినవాడవు నీవే.

గలతీయులకు 3:9 – కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.

-Daniel

దానియేలు 6:4 – అందుకా ప్రధానులును అధిపతులును రాజ్యపాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయినను లోపమైనను కనుగొనలేకపోయిరి.

-Paul

అపోస్తలులకార్యములు 20:20 – మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు,

అపోస్తలులకార్యములు 20:27 – దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.

-Timothy

1కొరిందీయులకు 4:17 – ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీయొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.

-Tychicus

ఎఫెసీయులకు 6:21 – మీరును నా క్షేమ సమాచారమంతయు తెలిసికొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నియు మీకు తెలియజేయును.

-Epaphras

కొలొస్సయులకు 1:7 – ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.

-Onesimus

కొలొస్సయులకు 4:9 – అతనిని అతనితో కూడ నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను; ఇతడు మీయొద్దనుండి వచ్చినవాడే; వీరిక్కడి సంగతులన్నియు మీకు తెలియజేతురు.

-Silvanus

1పేతురు 5:12 – మిమ్మును హెచ్చరించుచు, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వానుచేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి.

-Antipas

ప్రకటన 2:13 – సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును