Display Topic
Is the substance of things hoped for
హెబ్రీయులకు 11:1 – విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.
Is the evidence of things not seen
హెబ్రీయులకు 11:1 – విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.
Commanded
మత్తయి 11:22 – విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
1యోహాను 3:23 – ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచియుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని
The objects of, are
-God
యోహాను 14:1 – మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి.
-Christ
యోహాను 6:29 – యేసు ఆయన పంపినవానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.
అపోస్తలులకార్యములు 20:21 – దేవుని యెదుట మారుమనస్సుపొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును.
-Writings of Moses
యోహాను 5:46 – అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు.
అపోస్తలులకార్యములు 24:14 – ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి,
-Writings of the Prophets
2దినవృత్తాంతములు 20:20 – అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి యూదా వారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను.
అపోస్తలులకార్యములు 26:27 – అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.
-the gospel
మార్కు 1:15 – కాలము సంపూర్ణమైయున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది ? మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.
-promises of God
రోమీయులకు 4:21 – దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.
హెబ్రీయులకు 11:13 – వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనము చేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసము గలవారై మృతినొందిరి.
In Christ is
-the gift of God
రోమీయులకు 12:3 – తన్నుతాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.
ఎఫెసీయులకు 2:8 – మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
ఎఫెసీయులకు 6:23 – తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.
ఫిలిప్పీయులకు 1:29 – ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున
-the Work of God
అపోస్తలులకార్యములు 11:21 – ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.
1కొరిందీయులకు 2:5 – నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.
-Precious
2పేతురు 1:1 – యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
-Most holy
యూదా 1:20 – ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు,
-Fruitful
1దెస్సలోనీకయులకు 1:3 – మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
-Accompanied by repentance
మార్కు 1:15 – కాలము సంపూర్ణమైయున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది ? మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.
లూకా 24:47 – యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.
-Followed by Conversion
అపోస్తలులకార్యములు 11:21 – ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.
Christ is the Author and Finisher of
హెబ్రీయులకు 12:2 – మనము కూడ ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.
Is a gift of the Holy Spirit
1కొరిందీయులకు 12:9 – మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను
The Scriptures designed to produce
యోహాను 20:31 – యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.
2తిమోతి 3:15 – నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.
Preaching designed to produce
యోహాను 17:20 – మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,
అపోస్తలులకార్యములు 8:12 – అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.
రోమీయులకు 10:14 – వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?
రోమీయులకు 10:15 – ప్రకటించువారు పంపబడనియెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందువిషయమై ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నది
రోమీయులకు 10:17 – కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
1కొరిందీయులకు 3:5 – అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి
Through it is
-Remission of sins
అపోస్తలులకార్యములు 10:43 – ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను.
రోమీయులకు 3:25 – పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని
-Justification
అపోస్తలులకార్యములు 13:39 – మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక.
రోమీయులకు 3:21 – ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.
రోమీయులకు 3:22 – అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.
రోమీయులకు 3:28 – కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.
రోమీయులకు 3:30 – దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.
రోమీయులకు 5:1 – కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము
గలతీయులకు 2:16 – ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.
-salvation
మార్కు 16:16 – నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
అపోస్తలులకార్యములు 16:31 – అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి
-sanctification
అపోస్తలులకార్యములు 15:9 – వారి హృదయములను విశ్వాసమువలన పవిత్ర పరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు
అపోస్తలులకార్యములు 26:18 – వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
-spiritual light
యోహాను 12:36 – మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.
యోహాను 12:46 – నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.
-spiritual life
యోహాను 20:31 – యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.
గలతీయులకు 2:20 – నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.
-Eternal life
యోహాను 3:15 – ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.
యోహాను 3:16 – దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
యోహాను 6:40 – ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.
యోహాను 6:47 – దేవునియొద్దనుండి వచ్చినవాడు తప్ప మరియెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు.
-rest in heaven
హెబ్రీయులకు 4:3 – కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియై యున్నను ఈ విశ్రాంతినిగూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.
-Edification
1తిమోతి 1:4 – విశ్వాస సంబంధమైన దేవుని యేర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.
యూదా 1:20 – ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు,
-Preservation
1పేతురు 1:5 – కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
-adoption
యోహాను 1:12 – తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
గలతీయులకు 3:26 – యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.
-access to God
రోమీయులకు 5:2 – మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.
ఎఫెసీయులకు 3:12 – ఆయన యందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.
-inheritance of the promises
గలతీయులకు 3:22 – యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను.
హెబ్రీయులకు 6:12 – మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.
-the gift of the holy spirit
అపోస్తలులకార్యములు 11:15 – నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మనమీదికి దిగిన ప్రకారము వారిమీదికిని దిగెను.
అపోస్తలులకార్యములు 11:16 – అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పినమాట నేను జ్ఞాపకము చేసికొంటిని.
అపోస్తలులకార్యములు 11:17 – కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడ సమానవరము అనుగ్రహించియుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను.
గలతీయులకు 3:14 – ఇందునుగూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
ఎఫెసీయులకు 1:13 – మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
Impossible to please God without
హెబ్రీయులకు 11:6 – విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
Justification is by, to be of grace
రోమీయులకు 4:16 – ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసము గలవారికికూడ దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.
Essential to the profitable reception of the gospel
హెబ్రీయులకు 4:2 – వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్‌ప్రయోజనమైనదాయెను.
Necessary in the Christian warfare
1తిమోతి 1:18 – నా కుమారుడువైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.
1తిమోతి 1:19 – అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలైపోయిన వారివలె చెడియున్నారు.
1తిమోతి 6:12 – విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల యెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.
The gospel effectual in those who have
1దెస్సలోనీకయులకు 2:13 – ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.
Excludes self-justification
రోమీయులకు 10:3 – ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.
రోమీయులకు 10:4 – విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు.
Excludes boasting
రోమీయులకు 3:27 – కాబట్టి అతిశయకారణమెక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమునుబట్టియా? కాదు, విశ్వాస న్యాయమునుబట్టియే.
Works by love
గలతీయులకు 5:6 – యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.
1తిమోతి 1:5 – ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే.
ఫిలేమోనుకు 1:5 – నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
Produces
-hope
రోమీయులకు 5:2 – మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.
-Joy
అపోస్తలులకార్యములు 16:34 – మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను.
1పేతురు 1:8 – మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును,
-peace
రోమీయులకు 15:13 – కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిపొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.
-confidence
యెషయా 28:16 – ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియై యున్నది విశ్వసించువాడు కలవరపడడు.
1పేతురు 2:6 – ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.
-Boldness in Preaching
కీర్తనలు 116:10 – నేను ఆలాగు మాటలాడి నమ్మికయుంచితిని. నేను మిగుల బాధపడినవాడను.
2కొరిందీయులకు 4:13 – కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి.
-Christ is Precious to Those Having
1పేతురు 2:7 – విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.
-Christ dwells in the heart by
ఎఫెసీయులకు 3:17 – తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు,
-Necessary in prayer
మత్తయి 21:22 – మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
యాకోబు 1:6 – అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.
– Those who are not Christ’s have not
యోహాను 10:26 – అయితే మీరు నా గొఱ్ఱలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు.
యోహాను 10:27 – నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
-An evidence of the new birth
1యోహాను 5:1 – యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు. పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టినవానిని ప్రేమించును.
By it saints
-Live
గలతీయులకు 2:20 – నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.
-Stand
రోమీయులకు 11:20 – మంచిది; వారు అవిశ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;
2కొరిందీయులకు 1:24 – మీ విశ్వాసముమీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమైయున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.
-Walk
రోమీయులకు 4:12 – మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగుజాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.
2కొరిందీయులకు 5:7 – గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని యెరిగియుండియు, ఎల్లప్పుడును ధైర్యము గలవారమై యున్నాము.
-obtain A good report
హెబ్రీయులకు 11:2 – దానినిబట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి.
-overcome the world
1యోహాను 5:4 – దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే
1యోహాను 5:5 – యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?
-resist the devil
1పేతురు 5:9 – లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.
-overcome the devil
ఎఫెసీయులకు 6:16 – ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
-Are supported
కీర్తనలు 27:13 – సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము
1తిమోతి 4:10 – మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.
Saints die in
హెబ్రీయులకు 11:13 – వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనము చేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసము గలవారై మృతినొందిరి.
Saints should
-be sincere in
1తిమోతి 1:5 – ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే.
2తిమోతి 1:5 – ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను.
-abound in
2కొరిందీయులకు 8:7 – మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తయందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి.
-Continue in
అపోస్తలులకార్యములు 14:22 – శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
కొలొస్సయులకు 1:23 – పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
-be Strong in
రోమీయులకు 4:20 – అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక
రోమీయులకు 4:21 – దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.
రోమీయులకు 4:22 – అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
రోమీయులకు 4:23 – అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని
రోమీయులకు 4:24 – మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయబడెను.
-Stand fast in
1కొరిందీయులకు 16:13 – మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారై యుండుడి, బలవంతులైయుండుడి;
-be grounded and settled in
కొలొస్సయులకు 1:23 – పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
-Hold, with A good conscience
1తిమోతి 1:19 – అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలైపోయిన వారివలె చెడియున్నారు.
-Pray for the Increase of
లూకా 17:5 – అపొస్తలులు మా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా
-Have full assurance of
2తిమోతి 1:12 – ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.
హెబ్రీయులకు 10:22 – మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
True, evidenced by its fruits
యాకోబు 2:21 – మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించినప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?
యాకోబు 2:22 – విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా?
యాకోబు 2:23 – కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను.
యాకోబు 2:24 – మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.
యాకోబు 2:25 – అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?
Without fruits, is dead
యాకోబు 2:17 – ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.
యాకోబు 2:20 – వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసికొన గోరుచున్నావా?
యాకోబు 2:26 – ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
Examine whether you be in
2కొరిందీయులకు 13:5 – మీరు విశ్వాసము గలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మునుగూర్చి మీరే యెరుగరా?
All difficulties overcome by
మత్తయి 17:20 – అందుకాయన మీ అల్పవిశ్వాసముచేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును;
మత్తయి 21:21 – అందుకు యేసు మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను
మార్కు 9:23 – అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.
All things should be done in
రోమీయులకు 14:22 – నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు.
Whatever is not of, is sin
రోమీయులకు 14:23 – అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషియని తీర్పునొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.
Often tried by affliction
1పేతురు 1:6 – ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.
1పేతురు 1:7 – నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
Trial of, works patience
యాకోబు 1:3 – మీరు నానావిధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.
The wicked often profess
అపోస్తలులకార్యములు 8:13 – అప్పుడు సీమోను కూడ నమ్మి బాప్తిస్మముపొంది ఫిలిప్పును ఎడబాయకుండి, సూచక క్రియలును గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతినొందెను.
అపోస్తలులకార్యములు 8:21 – నీ హృదయము దేవుని యెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు.
The wicked destitute of
యోహాను 10:25 – అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
యోహాను 12:37 – యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.
అపోస్తలులకార్యములు 19:9 – అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాటశాలలో తర్కించుచు వచ్చెను
2దెస్సలోనీకయులకు 3:2 – మేము మూర్ఖులైన దుష్టమనుష్యులచేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మాకొరకు ప్రార్థించుడి; విశ్వాసము అందరికి లేదు.
Protection of, illustrated
-A Shield
ఎఫెసీయులకు 6:16 – ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
-A Breastplate
1దెస్సలోనీకయులకు 5:8 – మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాసప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.
Exemplified
-Caleb
సంఖ్యాకాండము 13:30 – కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
-Job
యోబు 19:25 – అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
– Shadrach, &c
దానియేలు 3:17 – మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను
-Daniel
దానియేలు 6:10 – ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి యుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను.
దానియేలు 6:23 – రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు.
-Peter
మత్తయి 16:16 – అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.
-Woman who Was A sinner
లూకా 7:50 – అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.
-Nathanael
యోహాను 1:49 – నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.
-Samaritans
యోహాను 4:39 – నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
-Martha
యోహాను 11:27 – ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.
-the disciples
యోహాను 16:30 – సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా
-Thomas
యోహాను 20:28 – అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.
-Stephen
అపోస్తలులకార్యములు 6:5 – ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్పరచుకొని
-Priests
అపోస్తలులకార్యములు 6:7 – దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.
-Ethiopian
అపోస్తలులకార్యములు 8:37 – ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి.
-Barnabas
అపోస్తలులకార్యములు 11:24 – అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షమున చేరిరి.
-Sergius Paulus
అపోస్తలులకార్యములు 13:12 – అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.
-Philippian jailor
అపోస్తలులకార్యములు 16:31 – అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి
అపోస్తలులకార్యములు 16:34 – మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను.
-Romans
రోమీయులకు 1:8 – మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసుక్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
-Colossians
కొలొస్సయులకు 1:4 – మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
-Thessalonians
1దెస్సలోనీకయులకు 1:3 – మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
-Lois
2తిమోతి 1:5 – ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను.
-Paul
2తిమోతి 4:7 – మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
-Abel
హెబ్రీయులకు 11:4 – విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు.
-Enoch
హెబ్రీయులకు 11:5 – విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.
-Noah
హెబ్రీయులకు 11:7 – విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపన చేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
-Abraham
హెబ్రీయులకు 11:8 – అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను
హెబ్రీయులకు 11:17 – అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.
-Isaac
హెబ్రీయులకు 11:20 – విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.
-Jacob
హెబ్రీయులకు 11:21 – విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తనచేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.
-Joseph
హెబ్రీయులకు 11:22 – యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములనుగూర్చి వారికి ఆజ్ఞాపించెను.
-Moses
హెబ్రీయులకు 11:24 – మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
హెబ్రీయులకు 11:27 – విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.
-Rahab
హెబ్రీయులకు 11:31 – విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపకపోయెను.
– Gideon &c
హెబ్రీయులకు 11:32 – ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారినిగూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.
హెబ్రీయులకు 11:33 – వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;
హెబ్రీయులకు 11:39 – వీరందరు తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను. మనము లేకుండ సంపూర్ణులు కాకుండు నిమిత్తము,