Display Topic


A branch of the river of Eden

ఆదికాండము 2:14 – మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పువైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు

Called

-the river

నిర్గమకాండము 23:31 – మరియు ఎఱ్ఱ సముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీచేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు.

నెహెమ్యా 2:7 – ఇదియు గాక రాజుతో నేనిట్లంటిని రాజున కనుకూలమైతే యూదా దేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతల నున్న అధికారులకు తాకీదులను,

కీర్తనలు 72:8 – సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.

-the great river

ఆదికాండము 15:18 – ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా

ద్వితియోపదేశాకాండము 1:7 – మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబాలోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసు వరకును వెళ్లుడి.

-the flood

యెహోషువ 24:2 – యెహోషువ జనులందరితో ఇట్లనెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగాఆదికాలమునుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.

Waters of, considered wholesome

యిర్మియా 2:18 – నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.

Often overflowed its banks

యెషయా 8:7 – కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటిమీదను పొర్లిపారును.

యెషయా 8:8 – అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును.

Assyria bounded by

2రాజులు 23:29 – అతని దినములయందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.

యెషయా 7:20 – ఆ దినమున యెహోవా నది (యూప్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజుచేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డము కూడను గీచివేయును.

Babylon situated on

యిర్మియా 51:13 – విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు.

యిర్మియా 51:36 – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆల కించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును దాని సముద్రమును నేనెండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును.

Extreme eastern boundary of the promised land

ఆదికాండము 15:18 – ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా

ద్వితియోపదేశాకాండము 1:7 – మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబాలోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసు వరకును వెళ్లుడి.

ద్వితియోపదేశాకాండము 11:24 – మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.

Egyptian army destroyed at

యిర్మియా 46:2 – ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండునుగూర్చిన మాట.

యిర్మియా 46:6 – త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందు వారు తొట్రిల్లిపడుచున్నారు.

యిర్మియా 46:10 – ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసు నదియొద్ద ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలి జరిగింపబోవుచున్నాడు.

Frequented by the captive Jews

కీర్తనలు 137:1 – బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి.

Captivity of Judah represented by the marring of Jeremiah’s girdle in

యిర్మియా 13:3 – రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై

యిర్మియా 13:4 – నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసికొని, లేచి యూఫ్రటీసునొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా

యిర్మియా 13:5 – యెహోవా నాకాజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసునొద్ద దాని దాచిపెట్టితిని.

యిర్మియా 13:6 – అనేక దినములైన తరువాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసునొద్దకు పోయి, నేను అక్కడ దాచిపెట్టుమని నీకాజ్ఞాపించిన నడికట్టును అక్కడనుండి తీసికొనుమని నాతో చెప్పగా

యిర్మియా 13:7 – నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టినచోటనుండి దాని తీసికొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయియుండెను; అది దేనికిని పనికిరానిదాయెను.

యిర్మియా 13:8 – కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

యిర్మియా 13:9 – యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహా గర్వమును నేను భంగపరచుదును.

Prophecies respecting Babylon thrown into, as a sign

యిర్మియా 51:63 – ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసు నదిలో దాని వేసి

Shall be the scene of future judgments

ప్రకటన 16:12 – ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండిపోయెను.