Display Topic
The emblem of the priestly office
హోషేయ 3:4 – నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాల దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలినర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.
Worn by
-the High Priest
1సమూయేలు 2:28 – అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నేనతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని.
1సమూయేలు 14:3 – షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను.
-Ordinary Priests
1సమూయేలు 22:18 – రాజు దోయేగుతో నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీద పడి ఏఫోదు ధరించుకొనిన యెనుబది యయిదుగురిని ఆ దినమున హతముచేసెను.
-Persons engaged in the service of God
1సమూయేలు 2:18 – బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను.
2సమూయేలు 6:14 – దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను.
-Generally of linen
1సమూయేలు 2:18 – బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను.
2సమూయేలు 6:14 – దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను.
For the high priest
-Commanded to be made
నిర్గమకాండము 28:4 – పతకము ఏఫోదు నిలువుటంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
-made of offerings of the people
నిర్గమకాండము 25:4 – నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,
నిర్గమకాండము 25:7 – లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.
– Made of gold, blue, purple, scarlet, &c
నిర్గమకాండము 28:6 – బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయవలెను.
నిర్గమకాండము 29:2 – ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసికొనుము.
నిర్గమకాండము 29:3 – గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొని రావలెను.
-Shoulders of, Joined by Onyx stones engraved with names of the Twelve tribes of Israel
నిర్గమకాండము 28:7 – రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడి యుండును.
నిర్గమకాండము 28:9 – మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమము చొప్పున
నిర్గమకాండము 28:10 – ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నముమీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.
నిర్గమకాండము 28:11 – ముద్రమీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.
నిర్గమకాండము 28:12 – అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును
నిర్గమకాండము 39:4 – దానికి కూర్చు భుజఖండములను చేసిరి, దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను.
నిర్గమకాండము 39:6 – మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధపరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను.
నిర్గమకాండము 39:7 – అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజములమీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
-had A Girdle of curious Work
నిర్గమకాండము 28:8 – మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.
-Breastplate of judgment inseparably united to
నిర్గమకాండము 28:25 – అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.
నిర్గమకాండము 28:26 – మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.
నిర్గమకాండము 28:27 – మరియు నీవు రెండు బంగారు ఉంగరములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను.
నిర్గమకాండము 28:28 – అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను
నిర్గమకాండము 39:20 – మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పునొద్దనున్న దాని యెదుటి ప్రక్కను, ఏఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి.
నిర్గమకాండము 39:21 – ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదునుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలిసూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
-Worn over the robe
నిర్గమకాండము 28:31 – మరియు ఏఫోదు నిలువుటంగీని కేవలము నీలి దారముతో కుట్టవలెను.
లేవీయకాండము 8:7 – తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని, ఏఫోదునువేసి ఏఫోదుయొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకమువేసి
-Fastened on with its own Girdle
లేవీయకాండము 8:7 – తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని, ఏఫోదునువేసి ఏఫోదుయొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకమువేసి
-Worn or Held by him when Consulted
1సమూయేలు 23:6 – అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేతపట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదునొద్దకు వచ్చెను.
1సమూయేలు 23:9 – సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను.
1సమూయేలు 23:10 – అప్పుడు దావీదు ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడుచేయ నుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడియున్నది.
1సమూయేలు 23:11 – కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను.
1సమూయేలు 23:12 – కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను.
1సమూయేలు 30:7 – పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను.
1సమూయేలు 30:8 – నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.
-Used by Idolatrous Priests
న్యాయాధిపతులు 8:27 – కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోను కును అతని యింటివారికిని ఉరిగానుండెను.
న్యాయాధిపతులు 17:5 – మీకా అను ఆ మనుష్యునికి దేవమందిర మొకటి యుండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారు లలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను.
న్యాయాధిపతులు 18:14 – కాబట్టి లాయిషుదేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మను ష్యులు తమ సహోదరులను చూచిఈ యిండ్లలో ఏఫోదును గృహదేవతలును చెక్క బడిన ప్రతిమయు పోతవిగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా
-Israel deprived of, for Sin
హోషేయ 3:4 – నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాల దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలినర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.