
Water
యోహాను 3:5 – యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను 7:38 – నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.
యోహాను 7:39 – తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
-cleansing
యెహెజ్కేలు 16:9 – అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీమీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి
యెహెజ్కేలు 36:25 – మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.
ఎఫెసీయులకు 5:26 – అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,
హెబ్రీయులకు 10:22 – మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
-Fertilising
కీర్తనలు 1:3 – అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.
యెషయా 27:3 – యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.
యెషయా 27:6 – రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.
యెషయా 44:3 – నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.
యెషయా 44:4 – నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.
యెషయా 58:11 – యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును నీవు నీరుకట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.
-Refreshing
కీర్తనలు 46:4 – ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి.
యెషయా 41:17 – దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.
యెషయా 41:18 – జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు
-Abundant
యోహాను 7:37 – ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
యోహాను 7:38 – నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.
-Freely Given
యెషయా 55:1 – దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలు లేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి.
యోహాను 4:14 – నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటిబుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
ప్రకటన 22:17 – ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
Fire
-Purifying
యెషయా 4:4 – తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు
మలాకీ 3:2 – అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటివాడు;
మలాకీ 3:3 – వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని యుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.
-Illuminating
నిర్గమకాండము 13:21 – వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.
కీర్తనలు 78:14 – పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను
-Searching
జెఫన్యా 1:12 – ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును.
1కొరిందీయులకు 2:10 – మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.
Wind
-Independent
యోహాను 3:8 – గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
1కొరిందీయులకు 12:11 – అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.
-Powerful
1రాజులు 19:11 – అందుకాయన నీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నా భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.
అపోస్తలులకార్యములు 2:2 – అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.
-Sensible in its effects
యోహాను 3:8 – గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
-Reviving
యెహెజ్కేలు 37:9 – అప్పడు ఆయన నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము.
యెహెజ్కేలు 37:10 – ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.
యెహెజ్కేలు 37:14 – నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.
Oil
కీర్తనలు 45:7 – నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చగునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు.
-Healing
లూకా 10:34 – అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను
ప్రకటన 3:18 – నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
-Comforting
యెషయా 61:3 – సీయోనులో దుఃఖించువారికి ఉల్లాసవస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును.
హెబ్రీయులకు 1:9 – నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.
-Illuminating
మత్తయి 25:3 – బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు.
మత్తయి 25:4 – బుద్ధి గలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి.
1యోహాను 2:20 – అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.
1యోహాను 2:27 – అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు భోదించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు భోదించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు (నిలిచియుండుడి).
-Consecrating
నిర్గమకాండము 29:7 – అభిషేకతైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను.
నిర్గమకాండము 30:30 – మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులై యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను.
యెషయా 61:1 – ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును
Rain and dew
కీర్తనలు 72:6 – గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజయము చేయును.
-Fertilising
యెహెజ్కేలు 34:26 – వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును,
యెహెజ్కేలు 34:27 – ఫలవృక్ష ములు ఫలములిచ్చును, భూమి పంటపండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలోనుండి వారిని విడిపింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
హోషేయ 6:3 – యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.
హోషేయ 10:12 – నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.
హోషేయ 14:5 – చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామరపుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధినొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు.
-Refreshing
కీర్తనలు 68:9 – దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి.
యెషయా 18:5 – కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును.
-Abundant
కీర్తనలు 133:3 – సీయోను కొండలమీదికి దిగివచ్చు హెర్మోను మంచువలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు.
-Imperceptible
2సమూయేలు 17:12 – అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో యొకదానియందు అతనిమీద పడుదుము; నేలమీద మంచుపడురీతిగా మనము అతనిమీదికి వచ్చినయెడల అతని పక్షపువారిలో ఒకడును తప్పించుకొనజాలడు.
మార్కు 4:26 – మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి,
మార్కు 4:27 – రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియనిరీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది.
మార్కు 4:28 – భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును.
A dove
మత్తయి 3:16 – యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
-Gentle
మత్తయి 10:16 – ఇదిగో తోడేళ్ల మధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
గలతీయులకు 5:22 – అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
A voice
యెషయా 6:8 – అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా
-speaking
మత్తయి 10:20 – మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.
-Guiding
యెషయా 30:21 – మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.
యోహాను 16:13 – అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును
-Warning
హెబ్రీయులకు 3:7 – మరియు పరిశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు.
హెబ్రీయులకు 3:8 – నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
హెబ్రీయులకు 3:9 – నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
హెబ్రీయులకు 3:10 – కావున నేను ఆ తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు.
హెబ్రీయులకు 3:11 – గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.
A seal
ప్రకటన 7:2 – మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో
-Securing
ఎఫెసీయులకు 1:13 – మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
ఎఫెసీయులకు 1:14 – దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
ఎఫెసీయులకు 4:30 – దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
-Authenticating
యోహాను 6:27 – క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.
2కొరిందీయులకు 1:22 – ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు.
Cloven tongues
అపోస్తలులకార్యములు 2:3 – మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ
అపోస్తలులకార్యములు 2:6 – ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి.
అపోస్తలులకార్యములు 2:7 – అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?
అపోస్తలులకార్యములు 2:8 – మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?
అపోస్తలులకార్యములు 2:9 – పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలి వారు,
అపోస్తలులకార్యములు 2:10 – కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,
అపోస్తలులకార్యములు 2:11 – క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.