Display Topic


Despised by the Jews

2సమూయేలు 3:8 – అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటివారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా?

Described as

-Impatient of injury

సామెతలు 26:17 – తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.

-unclean

లూకా 16:21 – అతని బల్లమీదనుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.

2పేతురు 2:22 – కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.

-Carnivorous

1రాజులు 14:11 – పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును; బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినును; యెహోవా మాటయిచ్చియున్నాడు.

2రాజులు 9:35 – వారు దానిని పాతిపెట్టబోయిరి; అయితే దాని కపాలమును పాదములును అరచేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు.

2రాజులు 9:36 – వారు తిరిగివచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను ఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును.

-Fond of blood

1రాజులు 21:19 – నీవు అతని చూచి యీలాగు ప్రకటించుము యెహోవా సెలవిచ్చునదేమనగా దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చునదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.

1రాజులు 22:38 – వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.

-Dangerous and destructive

కీర్తనలు 22:16 – కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.

Infested cities by night

కీర్తనలు 59:14 – సాయంకాలమున వారు మరల వచ్చెదరు కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు

కీర్తనలు 59:15 – తిండికొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగనియెడల రాత్రి అంతయు ఆగుదురు.

Nothing holy to be given to

మత్తయి 7:6 – పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును.

మత్తయి 15:26 – అందుకాయన పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా

Things torn by beasts given to

నిర్గమకాండము 22:31 – మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను.

Sacrificing of, an abomination

యెషయా 66:3 – ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.

Price of, not to be consecrated

ద్వితియోపదేశాకాండము 23:18 – పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు.

When domesticated

-employed in watching flocks

యోబు 30:1 – ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.

– Fed with the crumbs, &c

మత్తయి 15:27 – ఆమె నిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినునుగదా అని చెప్పెను.

Manner of, in drinking alluded to

న్యాయాధిపతులు 7:5 – అతడు నీళ్లయొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవాకుక్కగతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకుమోకాళ్లూని క్రుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను.

Illustrative

-of Gentiles

మత్తయి 15:22 – ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.

మత్తయి 15:26 – అందుకాయన పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా

-of covetous Ministers

యెషయా 56:11 – కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు.

-of fools

సామెతలు 26:11 – తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు.

-of apostates

2పేతురు 2:22 – కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.

-of Persecutors

కీర్తనలు 22:16 – కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.

కీర్తనలు 22:20 – ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.

-of obstinate sinners

మత్తయి 7:6 – పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును.

ప్రకటన 22:15 – కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

– Of false teachers

ఫిలిప్పీయులకు 3:2 – కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.

– (Dumb,) of unfaithful ministers

యెషయా 56:10 – వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగకుక్కలు మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.

– (Dead,) of the mean

1సమూయేలు 24:14 – ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా? మిన్నల్లిని గదా?

2సమూయేలు 9:8 – అతడు నమస్కరించి చచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను.