Is falsehood

కీర్తనలు 119:118 - నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించుదువు వారి కపటాలోచన మోసమే.

The tongue, the instrument of

రోమీయులకు 3:13 - వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

Comes from the heart

మార్కు 7:22 - నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.

Characteristic of the heart

యిర్మియా 17:9 - హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

God abhors

కీర్తనలు 5:6 - అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.

Forbidden

సామెతలు 24:28 - నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా?

1పేతురు 3:10 - జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

Christ was perfectly free from

యెషయా 53:9 - అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.

1పేతురు 2:22 - ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

Saints

-Free from

కీర్తనలు 24:4 - వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే.

జెఫన్యా 3:13 - ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు;

ప్రకటన 14:5 - వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.

-Purposed against

యోబు 27:4 - నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు.

-Avoid

యోబు 31:5 - అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసము చేయుటకై నా కాలు త్వరపడినయెడల

-Shun Those Addicted to

కీర్తనలు 101:7 - మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.

-Pray for deliverance from Those who use

కీర్తనలు 43:1 - దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యెమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారిచేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.

కీర్తనలు 120:2 - యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.

-delivered from Those who use

కీర్తనలు 72:14 - కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.

-Should beware of Those who teach

ఎఫెసీయులకు 5:6 - వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి; ఇట్టి క్రియలవలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును

కొలొస్సయులకు 2:8 - ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.

-Should lay aside, in Seeking Truth

1పేతురు 2:1 - ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్నయెడల

Ministers should lay aside

2కొరిందీయులకు 4:2 - అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము

1దెస్సలోనీకయులకు 2:3 - ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని

The wicked

-Are full of

రోమీయులకు 1:29 - అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై

-Devise

కీర్తనలు 35:20 - వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్నవారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు.

కీర్తనలు 38:12 - నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడుచేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.

సామెతలు 12:5 - నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు.

-Utter

కీర్తనలు 10:7 - వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.

కీర్తనలు 36:3 - వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసియున్నాడు.

-Work

సామెతలు 11:18 - భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.

-Increase in

2తిమోతి 3:13 - అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.

-use, to each other

యిర్మియా 9:5 - సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.

-use, to Themselves

యిర్మియా 37:9 - యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనేవెళ్లరు.
WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.