Display Topic
The light first called
ఆదికాండము 1:5 – దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
Natural, from evening to evening
ఆదికాండము 1:5 – దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
లేవీయకాండము 23:32 – అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.
Artificial, the time of the sun’s continuance above the horizon
ఆదికాండము 31:39 – దుష్టమృగములచేత చీల్చబడిన దానిని నీయొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దానినేమి రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.
ఆదికాండము 31:40 – పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను.
నెహెమ్యా 4:21 – ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితివిు; సగముమంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి.
నెహెమ్యా 4:22 – మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వానితోకూడ యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని.
Prophetical, a year
యెహెజ్కేలు 4:6 – ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సరమొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించియున్నాను.
దానియేలు 12:12 – వెయ్యిన్ని మూడువందల ముప్పదియైదు దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు.
Artificial, divided into
-break of
ఆదికాండము 32:24 – యాకోబు ఒక్కడు మిగిలిపోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.
ఆదికాండము 32:26 – ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.
పరమగీతము 2:17 – చల్లనిగాలి వీచువరకు నీడలు లేకపోవువరకు ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను కొండబాటలమీద త్వరపడి రమ్ము.
-morning
నిర్గమకాండము 29:39 – సాయంకాలమందు ఒక గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.
2సమూయేలు 23:4 – ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బు లేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలోనుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును.
-Noon
ఆదికాండము 43:16 – యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహకునితో ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను.
కీర్తనలు 55:17 – సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
-Decline of
న్యాయాధిపతులు 19:8 – అయిదవ దినమున అతడు వెళ్లవలెనని ఉదయ మున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రినీవు నీ ప్రాణము బలపరచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దు వ్రాలు వరకు తడవుచేసి యిద్దరు కూడి భోజనము చేసిరి.
న్యాయాధిపతులు 19:9 – ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ల లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామఇదిగో ప్రొద్దు గ్రుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి యీ రాత్రి యిక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గ్రుంకుచున్నది, సంతోషించి యిక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్లుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను
లూకా 9:12 – ప్రొద్దుగ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించుకొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి.
లూకా 24:29 – వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితోకూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.
-evening
ఆదికాండము 8:11 – సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.
కీర్తనలు 104:23 – సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలువెళ్లుదురు.
యిర్మియా 6:4 – ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి; లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ, ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి.
Sometimes divided into four parts
నెహెమ్యా 9:3 – మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చదువుచు వచ్చిరి, ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి.
Later subdivided into twelve hours
మత్తయి 20:3 – తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంతవీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి
మత్తయి 20:5 – దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.
మత్తయి 20:6 – తిరిగి దాదాపు అయిదు గంటలకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా
యోహాను 11:9 – అందుకు యేసు పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు.
Time of, ascertained by the dial
2రాజులు 20:11 – ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలకమీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పదిమెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను.
Succession of, secured by covenant
ఆదికాండము 8:22 – భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.
Made for the glory of God
కీర్తనలు 74:16 – పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.
Proclaims the glory of God
కీర్తనలు 19:2 – పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.
Under the control of God
ఆమోసు 5:8 – ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారుచీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.
ఆమోసు 8:9 – ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును.
A time of judgment called a day of
-Anger
విలాపవాక్యములు 2:21 – యౌవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్యకలును నా యౌవనులును ఖడ్గముచేత కూలియున్నారు నీ ఉగ్రతదినమున నీవు వారిని హతముచేసితివి దయతలచక వారినందరిని వధించితివి.
-wrath
యోబు 20:28 – వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.
జెఫన్యా 1:15 – ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహా నాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ము దినము.
జెఫన్యా 1:18 – యెహోవా ఉగ్రతదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడు.
రోమీయులకు 2:5 – నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.
-Visitation
మీకా 7:4 – వారిలో మంచివారు ముండ్లచెట్టు వంటివారు, వారిలో యథార్థవంతులు ముండ్లకంచె కంటెను ముండ్లుముండ్లుగా నుందురు, నీ కాపరుల దినము నీవు శిక్షనొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు.
-Destruction
యోబు 21:30 – అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు ఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.
-darkness
యోవేలు 2:2 – ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.
జెఫన్యా 1:15 – ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహా నాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ము దినము.
-Trouble
కీర్తనలు 102:2 – నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తరమిమ్ము.
-calamity
ద్వితియోపదేశాకాండము 32:35 – వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.
యిర్మియా 18:17 – తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులయెదుట నిలువకుండ వారిని నేను చెదరగొట్టెదను; వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును.
-adversity
సామెతలు 24:10 – శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకానివాడవగుదువు.
-Vengeance
సామెతలు 6:34 – భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు.
యెషయా 61:2 – యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును
-Slaughter
యెషయా 30:25 – గోపురములు పడు మహా హత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను వాగులును నదులును పారును.
యిర్మియా 12:3 – యెహోవా, నీవు నన్నెరిగియున్నావు; నన్ను చూచుచున్నావు; నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు; వధకు ఏర్పడిన గొఱ్ఱలనువలె వారిని హతము చేయుము, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము.
-evil
యిర్మియా 17:17 – ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము.
ఆమోసు 6:3 – ఉపద్రవదినము బహుదూరమున నున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీమధ్య మీరు పీఠములు స్థాపింతురు.
ఎఫెసీయులకు 6:13 – అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి
-the Lord
యెషయా 2:12 – అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.
యెషయా 13:6 – యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.
జెఫన్యా 1:14 – యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.
A time of mercy called a day of
-salvation
2కొరిందీయులకు 6:2 – అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!
-redemption
ఎఫెసీయులకు 4:30 – దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
-Visitation
యిర్మియా 27:22 – అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి యీ స్థలములో వాటిని మరల నుంచు కాలమువరకు అవి అక్కడ నుండవలెను; ఇదే యెహోవా వాక్కు.
1పేతురు 2:12 – అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను
– God’s power
కీర్తనలు 110:3 – యుద్ధసన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములోనుండి నీయొద్దకు వచ్చెదరు
A time of festivity called a
-good day
ఎస్తేరు 8:17 – రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను, అది శుభదినమని విందు చేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి.
ఎస్తేరు 9:19 – కాబట్టి ప్రాకారములు లేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము పదునాలుగవ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి.
-day of good tidings
2రాజులు 7:9 – వారు మనము చేయునది మంచిపని కాదు, నేటిదినము శుభ వర్తమానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చట నుండినయెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటివారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని
-day which the Lord has made
కీర్తనలు 118:24 – ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.
-Solemn day
సంఖ్యాకాండము 10:10 – మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలులనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.
హోషేయ 9:5 – నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమిచేతురు?
-day of gladness
సంఖ్యాకాండము 10:10 – మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలులనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.
The time for labour
కీర్తనలు 104:22 – సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును.
Wild beasts hide during
కీర్తనలు 104:22 – సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును.
Illustrative of
-Time of judgment
1కొరిందీయులకు 3:13 – వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.
1కొరిందీయులకు 4:3 – మీచేతనైనను, ఏ మనుష్యునిచేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.
-spiritual light
1దెస్సలోనీకయులకు 5:5 – మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము.
1దెస్సలోనీకయులకు 5:8 – మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాసప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.
2పేతురు 1:19 – మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.
-the path of the just
సామెతలు 4:18 – పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,