Display Topic

Defined

ఫిలేమోనుకు 1:18 – అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసినయెడలను, నీకు ఏమైన ఋణమున్నయెడలను, అది నా లెక్కలో చేర్చుము;

Might demand

-Pledges

ద్వితియోపదేశాకాండము 24:10 – నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు

ద్వితియోపదేశాకాండము 24:11 – నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీయొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును.

సామెతలు 22:27 – చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల?

-Security of others

సామెతలు 6:1 – నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడినయెడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసినయెడల

సామెతలు 22:26 – చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.

-Mortgages on property

నెహెమ్యా 5:3 – మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువపెట్టితివిు గనుక మీయొద్ద ధాన్యము తీసికొందుమనిరి.

-Bills or promissory notes

లూకా 16:6 – వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసికొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పెను.

లూకా 16:7 – తరువాత వాడు నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు. వానితో నీవు నీ చీటి తీసికొని యెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను.

To return before sunset, garments taken in pledge

నిర్గమకాండము 22:26 – నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరల అప్పగించుము.

నిర్గమకాండము 22:27 – వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహమునకు వస్త్రము; వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొఱపెట్టినయెడల నేను విందును.

ద్వితియోపదేశాకాండము 24:12 – ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.

ద్వితియోపదేశాకాండము 24:13 – అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును.

యెహెజ్కేలు 18:7 – ఎవనినైనను భాదపెట్టకయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయు నుండువాడై, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

యెహెజ్కేలు 18:12 – దీనులను దరిద్రులను భాదపెట్టి బలాత్కారముచేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు,

Prohibited from

-Taking millstones in pledge

ద్వితియోపదేశాకాండము 24:6 – తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే.

-Violently selecting Pledges

ద్వితియోపదేశాకాండము 24:10 – నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు

-Exacting usury from brethren

నిర్గమకాండము 22:25 – నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వానియెడల జరిగింపకూడదు, వానికి వడ్డి కట్టకూడదు.

లేవీయకాండము 25:36 – నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసికొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.

లేవీయకాండము 25:37 – నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు.

-Exacting debts from brethren during sabbatical year

ద్వితియోపదేశాకాండము 15:2 – తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు.

ద్వితియోపదేశాకాండము 15:3 – అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరునియొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను.

Might take interest from strangers

ద్వితియోపదేశాకాండము 23:20 – అన్యునికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచుకొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.

Sometimes entirely remitted debts

నెహెమ్యా 5:10 – నేనును నా బంధువులును నా దాసులును కూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితివిు; ఆ అప్పు పుచ్చుకొనకుందము.

నెహెమ్యా 5:11 – ఈ దినములోనే వారియొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవతోటలను వారి యిండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవభాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని.

నెహెమ్యా 5:12 – అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని.

మత్తయి 18:27 – ఆ దాసుని యజమానుడు కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను.

లూకా 7:42 – ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.

Often cruel in exacting debts

నెహెమ్యా 5:7 – అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి

నెహెమ్యా 5:8 – అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితివిు, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి.

నెహెమ్యా 5:9 – మరియు నేను మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా?

యోబు 24:3 – తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు

యోబు 24:4 – వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించివేయుదురు దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.

యోబు 24:5 – అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును

యోబు 24:6 – పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురు దుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.

యోబు 24:7 – బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు.

యోబు 24:8 – పర్వతములమీది జల్లులకు తడిసియుందురు చాటులేనందున బండను కౌగలించుకొందురు.

యోబు 24:9 – తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరు వారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు

మత్తయి 18:28 – అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనిని చూచి, వాని గొంతుపట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను

మత్తయి 18:29 – అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నాయెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని

మత్తయి 18:30 – వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను.

Often exacted debts

-by selling the debtor or Taking him for A servant

మత్తయి 18:25 – అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.

నిర్గమకాండము 21:2 – నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడైయుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.

– By selling the debtor’s property

మత్తయి 18:25 – అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.

– By selling the debtor’s family

2రాజులు 4:1 – అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా

యోబు 24:9 – తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరు వారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు

మత్తయి 18:25 – అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.

-by imprisonment

మత్తయి 5:25 – నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.

మత్తయి 5:26 – కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

మత్తయి 18:34 – అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు బాధపరచువారికి వానినప్పగించెను.

-from the sureties

సామెతలు 11:15 – ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.

సామెతలు 22:26 – చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.

సామెతలు 22:27 – చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల?

Were often defrauded

1సమూయేలు 22:2 – మరియు ఇబ్బంది గలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండువారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందలమంది వచ్చియుండిరి.

లూకా 16:5 – తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివానినడిగెను.

లూకా 16:6 – వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసికొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పెను.

లూకా 16:7 – తరువాత వాడు నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు. వానితో నీవు నీ చీటి తీసికొని యెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను.

Illustrative of

– God’s claim upon men

మత్తయి 5:25 – నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.

మత్తయి 5:26 – కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

మత్తయి 18:23 – కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొనగోరిన యొక రాజును పోలియున్నది.

మత్తయి 18:25 – అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.

లూకా 7:41 – అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థులుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి.

లూకా 7:47 – ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి

-the demands of the law

గలతీయులకు 5:3 – ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై యున్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను.