Display Topic


God appoints

2రాజులు 6:33 – ఆ దూత అతనియొద్దకు వచ్చెను. అంతట రాజు ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి యుండవలెననెను.

యోబు 5:6 – శ్రమ ధూళిలోనుండి పుట్టదు. బాధ భూమిలోనుండి మొలవదు.

యోబు 5:17 – దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.

కీర్తనలు 66:11 – నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

ఆమోసు 3:6 – పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?

మీకా 6:9 – ఆలకించుడి; యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును, శిక్షనుగూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వానినిగూర్చిన వార్తను ఆలకించుడి

God dispenses, as He will

యోబు 11:10 – ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యెమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు?

యెషయా 10:15 – గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?

యెషయా 45:7 – నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను.

God regulates the measure of

కీర్తనలు 80:5 – కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు.

యెషయా 9:1 – అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువలేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.

యిర్మియా 46:28 – నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడైున్నాను భయపడకుము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశప్రజలను సమూల నాశనము చేసెదను అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమునుబట్టి నిన్ను శిక్షించెదను ఇదే యెహోవా వాక్కు.

God determines the continuance of

ఆదికాండము 15:13 – ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు.

ఆదికాండము 15:14 – వారు నాలుగువందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.

సంఖ్యాకాండము 14:33 – మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు.

యెషయా 10:25 – వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును.

యిర్మియా 29:10 – యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును.

God does not willingly send

విలాపవాక్యములు 3:33 – హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు.

Man is born to

యోబు 5:6 – శ్రమ ధూళిలోనుండి పుట్టదు. బాధ భూమిలోనుండి మొలవదు.

యోబు 5:7 – నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు.

యోబు 14:1 – స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.

Saints appointed to

1దెస్సలోనీకయులకు 3:3 – మనము శ్రమను అనుభవింపవలసి యున్నదని మీతో ముందుగా చెప్పితివిు గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;

Consequent upon the fall

ఆదికాండము 3:16 – ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.

ఆదికాండము 3:17 – ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;

ఆదికాండము 3:18 – అది ముండ్లతుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;

ఆదికాండము 3:19 – నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

Sin produces

యోబు 4:8 – నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు.

యోబు 20:11 – వారి యెముకలలో యౌవనబలము నిండియుండును గాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును.

సామెతలు 1:31 – కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు

Sin visited with

2సమూయేలు 12:14 – అయితే ఈ కార్యమువలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి

కీర్తనలు 89:30 – అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధుల నాచరింపనియెడల

కీర్తనలు 89:31 – వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననియెడల

కీర్తనలు 89:32 – నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను.

యెషయా 57:17 – వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.

అపోస్తలులకార్యములు 13:10 – అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?

అపోస్తలులకార్యములు 13:11 – ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.

Often severe

యోబు 16:7 – ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసియున్నాడు నా బంధువర్గమంతయు నీవు పాడుచేసియున్నావు

యోబు 16:8 – నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు. ఇదికూడ నామీద సాక్ష్యముగా నున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది.

యోబు 16:9 – ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను. ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.

యోబు 16:10 – జనులు నామీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు. వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు

యోబు 16:11 – దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు.

యోబు 16:12 – నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసియున్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు

యోబు 16:13 – ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరములేక నా తుండ్లను పొడిచెను నా పైత్యరసమును నేలను పారబోసెను.

యోబు 16:14 – కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగగొట్టెను పరుగులెత్తి శూరునివలె నామీద పడెను.

యోబు 16:15 – నా చర్మముమీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని నా కొమ్మును ధూళితో మురికిచేసితిని.

యోబు 16:16 – నాచేత బలాత్కారము జరుగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను

కీర్తనలు 42:7 – నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి.

కీర్తనలు 66:12 – నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించియున్నావు.

యోనా 2:3 – నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసియున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.

ప్రకటన 7:14 – అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను వీరు మహా శ్రమలనుండి వచ్చినవారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి.

Always less than we deserve

ఎజ్రా 9:13 – అయితే మా దుష్క్రియలనుబట్టియు మా గొప్ప అపరాధములనుబట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి

కీర్తనలు 103:10 – మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.

Frequently terminate in good

ఆదికాండము 50:20 – మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.

నిర్గమకాండము 1:11 – కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టిపనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.

నిర్గమకాండము 1:12 – అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయులయెడల అసహ్యపడిరి.

ద్వితియోపదేశాకాండము 8:15 – తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను,

ద్వితియోపదేశాకాండము 8:16 – తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను.

యిర్మియా 24:5 – ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా వారికి మేలుకలుగవలెనని ఈ స్థలమునుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను.

యిర్మియా 24:6 – వారికి మేలు కలుగునట్లు నేను వారిమీద దృష్టియుంచుచు, ఈ దేశమునకు వారిని మరల తీసికొనివచ్చి, పడగొట్టక వారిని కట్టెదను, పెల్లగింపక వారిని నాటెదను.

యెహెజ్కేలు 20:37 – చేతి కఱ్ఱక్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను.

Tempered with mercy

కీర్తనలు 78:38 – అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.

కీర్తనలు 78:39 – కాగా వారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలిరాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.

కీర్తనలు 106:43 – అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి.

కీర్తనలు 106:44 – అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను.

కీర్తనలు 106:45 – వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.

కీర్తనలు 106:46 – వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.

యెషయా 30:18 – కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడియున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.

యెషయా 30:19 – సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.

యెషయా 30:20 – ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు

యెషయా 30:21 – మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.

విలాపవాక్యములు 3:32 – ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.

మీకా 7:7 – అయినను యెహోవా కొరకు నేను ఎదురుచూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.

మీకా 7:8 – నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగిలేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును.

మీకా 7:9 – నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.

నహూము 1:12 – యెహోవా సెలవిచ్చునదేమనగా వారు విస్తారజనమై పూర్ణబలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు; నేను నిన్ను బాధపరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.

Saints are to expect

యోహాను 16:33 – నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను.

అపోస్తలులకార్యములు 14:22 – శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.

Of saints, are comparatively light

అపోస్తలులకార్యములు 20:23 – బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.

అపోస్తలులకార్యములు 20:24 – అయితే దేవుని కృపా సువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు

రోమీయులకు 8:18 – మనయెడల ప్రత్యక్షముకాబోవు మహిమయెదుట ఇప్పటికాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

2కొరిందీయులకు 4:17 – మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.

Of saints, are but temporary

కీర్తనలు 30:5 – ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.

కీర్తనలు 103:9 – ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు.

యెషయా 54:7 – నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

యెషయా 54:8 – మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యోహాను 16:20 – మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

1పేతురు 1:6 – ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

1పేతురు 5:10 – తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.

Saints have joy under

యోబు 5:17 – దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.

యాకోబు 5:11 – సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.

Of saints, end in joy and blessedness

కీర్తనలు 126:5 – కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.

కీర్తనలు 126:6 – పడికెడు విత్తనములు చేతపట్టుకొని యేడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.

యెషయా 61:2 – యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

యెషయా 61:3 – సీయోనులో దుఃఖించువారికి ఉల్లాసవస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును.

మత్తయి 5:4 – దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

1పేతురు 4:13 – క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.

1పేతురు 4:14 – క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

Often arise from the profession of the gospel

మత్తయి 24:9 – అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.

యోహాను 15:21 – అయితే వారు నన్ను పంపినవానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు.

2తిమోతి 3:11 – అంతియొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను

2తిమోతి 3:12 – క్రీస్తుయేసు నందు సద్భక్తితో బ్రదకనుద్దేశించు వారందరు హింస పొందుదురు.

Exhibit the love and faithfulness of God

ద్వితియోపదేశాకాండము 8:5 – ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని

కీర్తనలు 119:75 – యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.

సామెతలు 3:12 – తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.

1కొరిందీయులకు 11:32 – మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.

హెబ్రీయులకు 12:6 – ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి.

హెబ్రీయులకు 12:7 – శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?

ప్రకటన 3:19 – నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము.