Display Topic
Necessary to his priestly office
హెబ్రీయులకు 5:2 – తానుకూడ బలహీనతచేత ఆవరింపబడి యున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడైయున్నాడు.
హెబ్రీయులకు 5:7 – శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.
Manifested for the
-Weary and heavy-laden
మత్తయి 11:28 – ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నాయొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
మత్తయి 11:29 – నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
మత్తయి 11:30 – ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.
-Weak in faith
యెషయా 40:11 – గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
యెషయా 42:3 – నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.
మత్తయి 12:20 – విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు
-Tempted
హెబ్రీయులకు 2:18 – తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడైయున్నాడు.
-Afflicted
లూకా 7:13 – ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి–ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.
యోహాను 11:33 – ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ నుంచితిరని అడుగగా,
యోహాను 11:35 – యేసు కన్నీళ్లు విడిచెను.
-Diseased
మత్తయి 14:14 – ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.
మార్కు 1:41 – ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.
-Poor
మార్కు 8:2 – జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను;
-Perishing sinners
మత్తయి 9:36 – ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి
లూకా 19:41 – ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి
యోహాను 3:16 – దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
An encouragement to prayer
హెబ్రీయులకు 4:15 – మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.