Display Topic
First manifestation of
నిర్గమకాండము 13:20 – వారు సుక్కోతునుండి ప్రయాణమైపోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.
నిర్గమకాండము 13:21 – వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.
Called
-the cloud
నిర్గమకాండము 34:5 – మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.
-Pillar of cloud and Pillar of fire
నిర్గమకాండము 13:22 – ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యెదుటనుండి తొలగింపలేదు.
-Cloudy Pillar
నిర్గమకాండము 33:9 – మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను.
నిర్గమకాండము 33:10 – ప్రజలందరు ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి, లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి.
-cloud of the Lord
సంఖ్యాకాండము 10:34 – వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను.
-the presence of God
నిర్గమకాండము 33:14 – అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా
నిర్గమకాండము 33:15 – మోషే నీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొనిపోకుము.
God’s glory manifested in
నిర్గమకాండము 16:10 – అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.
నిర్గమకాండము 40:35 – ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను.
God came down in
నిర్గమకాండము 34:5 – మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.
సంఖ్యాకాండము 11:25 – యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతనిమీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు.
God spoke from
నిర్గమకాండము 24:16 – యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవ దినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు
కీర్తనలు 99:7 – మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాటలాడెను వారు ఆయన శాసనముల ననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి
Was designed to
-Regulate the movements of Israel
నిర్గమకాండము 40:36 – మేఘము మందిరము మీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి.
నిర్గమకాండము 40:37 – ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.
సంఖ్యాకాండము 9:17 – ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి.
సంఖ్యాకాండము 9:18 – యెహోవా నోటి మాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి. యెహోవా నోటి మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి.
సంఖ్యాకాండము 9:19 – ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి.
సంఖ్యాకాండము 9:20 – మేఘము కొన్ని దినములు మందిరముమీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటి మాటచొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాటచొప్పుననే ప్రయాణము చేసిరి.
సంఖ్యాకాండము 9:21 – ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచినయెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణముచేసిరి.
సంఖ్యాకాండము 9:22 – ఆ మేఘము రెండుదినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవుచేసి మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి.
సంఖ్యాకాండము 9:23 – యెహోవా మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పున వారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞననుసరించి నడిచిరి.
-Guide Israel
నిర్గమకాండము 13:21 – వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.
నెహెమ్యా 9:19 – వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను.
-Show light to Israel
కీర్తనలు 105:39 – వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను.
-Defend Israel
నిర్గమకాండము 14:19 – అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను
కీర్తనలు 105:39 – వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను.
-Cover the Tabernacle
నిర్గమకాండము 40:34 – అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.
సంఖ్యాకాండము 9:15 – వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను.
Was dark to the enemies of Israel
నిర్గమకాండము 14:20 – అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు
Was the Shekinah over the mercy-seat
లేవీయకాండము 16:2 – నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసముమీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.
Continued during the journeyings of Israel
నిర్గమకాండము 13:22 – ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యెదుటనుండి తొలగింపలేదు.
నిర్గమకాండము 40:38 – ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.
Manifested in the temple of Solomon
1రాజులు 8:10 – యాజకులు పరిశుద్ధ స్థలములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను.
1రాజులు 8:11 – కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి.
2దినవృత్తాంతములు 5:13 – వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాటకులును ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి.
యెహెజ్కేలు 10:4 – యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజోమహిమతో నిండినదాయెను.
Special appearances of
-at the murmuring for bread
నిర్గమకాండము 16:10 – అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.
-at giving of the law
నిర్గమకాండము 19:9 – యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాటలాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా
నిర్గమకాండము 19:16 – మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూరయొక్క మహా ధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.
నిర్గమకాండము 24:16 – యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవ దినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు
నిర్గమకాండము 24:17 – యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను.
నిర్గమకాండము 24:18 – అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను.
-at sedition of Aaron and Miriam
సంఖ్యాకాండము 12:5 – యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను.
-at the murmuring of Israel on the report of the Spies
సంఖ్యాకాండము 14:10 – ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయుల కందరికి కనబడెను.
– At the rebellion of Korah &c
సంఖ్యాకాండము 16:19 – కోరహు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను.
– At the murmuring of Israel on account of Korah’s death
సంఖ్యాకాండము 16:42 – సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారమువైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను; యెహోవా మహిమయు కనబడెను.
– At Christ’s transfiguration
మత్తయి 17:5 – అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను
– At Christ’s ascension
అపోస్తలులకార్యములు 1:9 – ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.
Our Lord shall make his second appearance in
లూకా 21:27 – అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.
అపోస్తలులకార్యములు 1:11 – గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగివచ్చునని వారితో చెప్పిరి
Illustrative of
-the glory of Christ
ప్రకటన 10:1 – బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.
-the protection of the Church
యెషయా 4:5 – సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.