Display Topic
Formed from the sea
1రాజులు 18:44 – ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను.
ఆమోసు 9:6 – ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండలమునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా.
Are garment of the sea
యోబు 38:9 – నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా?
God
-Established
సామెతలు 8:28 – ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు
-Balanced in the air
యోబు 37:16 – మేఘములను తేల చేయుటయు పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా?
-disposed in order
యోబు 37:15 – దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానము చేయునో నీకు తెలియునా?
-Brings over the earth
ఆదికాండము 9:14 – భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.
-Binds up
యోబు 26:8 – వాటిక్రింద మేఘములు చినిగిపోకుండ ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.
-Spreads out
యోబు 26:9 – దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను.
-Scatters
యోబు 37:11 – మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
Power and wisdom of God exhibited in forming
కీర్తనలు 135:6 – ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు
కీర్తనలు 135:7 – భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.
కీర్తనలు 147:5 – మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.
కీర్తనలు 147:8 – ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు
యిర్మియా 10:13 – ఆయన ఆజ్ఞనియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలోనుండి గాలిని రావించును.
యిర్మియా 51:16 – ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును. భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలోనుండి గాలిని రావించును.
Power and wisdom of God exhibited in condensing
యోబు 36:27 – ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును
యోబు 36:28 – మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును.
యోబు 37:10 – దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
యోబు 37:11 – మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
సామెతలు 3:20 – ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించుచున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.
Made for the glory of God
కీర్తనలు 148:4 – పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.
Called the
-Clouds of heaven
దానియేలు 7:13 – రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి, ఆ మహా వృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.
మత్తయి 24:30 – అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకుందురు
-Windows of heaven
ఆదికాండము 7:11 – నోవహు వయసు యొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపుతూములు విప్పబడెను.
యెషయా 24:18 – తూములు పైకి తీయబడియున్నవి భూమి పునాదులు కంపించుచున్నవి
-Bottles of heaven
యోబు 38:37 – జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
-Chambers of God
కీర్తనలు 104:3 – జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
కీర్తనలు 104:13 – తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది.
-Waters above the firmament
ఆదికాండము 1:7 – దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.
– Dust of God’s feet
నహూము 1:3 – యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.
Different kinds of, mentioned
-White
ప్రకటన 14:14 – మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడై యుండెను ఆయన శిరస్సుమీద సువర్ణ కిరీటమును,చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.
-Bright
యోబు 37:11 – మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
జెకర్యా 10:1 – కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును.
-Thick
యోబు 22:14 – గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదు ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.
యోబు 37:11 – మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
-Black
1రాజులు 18:45 – అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్లిపోయెను.
-Swift
యెషయా 19:1 – ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది
-great
యెహెజ్కేలు 1:4 – నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చుచుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతిదానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటిదొకటి కనబడెను.
-Small
1రాజులు 18:44 – ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను.
Often cover the heavens
కీర్తనలు 147:8 – ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు
Often obscure the sun, &c
యోబు 36:32 – ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును
యెహెజ్కేలు 32:7 – నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగుచేసెదను, నక్షత్రములను చీకటి కమ్మజేసెదను, సూర్యుని మబ్బుచేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును.
Often dispersed by the wind
హోషేయ 13:3 – కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.
Uses of
-to give rain
న్యాయాధిపతులు 5:4 – ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను యెహోవా, నీవు శేయీరునుండి బయలుదేరినప్పుడు ఎదోము పొలమునుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములును వర్షించెను.
కీర్తనలు 104:13 – తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది.
కీర్తనలు 104:14 – పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు
-to supply dew
సామెతలు 3:20 – ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించుచున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.
యెషయా 18:4 – యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును.
-to moderate heat
యెషయా 25:5 – ఎండిన దేశములో ఎండవేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.
From the west, bring rain
లూకా 12:54 – మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను మీరు పడమటనుండి మబ్బు పైకివచ్చుట చూచునప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు; ఆలాగే జరుగును.
Though small, often bring much rain
1రాజులు 18:44 – ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను.
1రాజులు 18:45 – అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్లిపోయెను.
Thunder and lightning come from
కీర్తనలు 77:17 – మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను.
కీర్తనలు 77:18 – నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.
The rainbow appears in
ఆదికాండము 9:13 – మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును.
ఆదికాండము 9:14 – భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.
Frequently the instrument of God’s judgments
ఆదికాండము 7:11 – నోవహు వయసు యొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపుతూములు విప్పబడెను.
ఆదికాండము 7:12 – నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.
యోబు 37:13 – శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.
కీర్తనలు 77:17 – మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను.
Man
-Ignorant of the spreading of
యోబు 36:29 – మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా?
-Ignorant of the disposing of
యోబు 37:15 – దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానము చేయునో నీకు తెలియునా?
-Ignorant of the balancing of
యోబు 37:16 – మేఘములను తేల చేయుటయు పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా?
-Cannot number
యోబు 38:37 – జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
-Cannot cause to rain
యోబు 38:34 – జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
-Cannot stay
యోబు 38:37 – జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
Illustrative
-of Multitudes of Persons
యెషయా 60:8 – మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసివచ్చు వీరెవరు?
హెబ్రీయులకు 12:1 – ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున
-of hostile armies
యిర్మియా 4:13 – మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలివలె నున్నవి, ఆయన గుఱ్ఱములు గద్దలకంటె వేగము గలవి, అయ్యో, మనము దోపుడు సొమ్మయితివిు.
యెహెజ్కేలు 38:9 – గాలి వాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశముమీదికి వచ్చెదవు, నీవును నీ సైన్యమును నీతోకూడిన బహు జనమును దేశముమీద వ్యాపింతురు.
యెహెజ్కేలు 38:16 – మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్యదినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసికొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశముమీదికి నిన్ను రప్పించెదను.
-of sins of Men
యెషయా 44:22 – మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.
-of judgments of God
విలాపవాక్యములు 2:1 – ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశమునుండి భూమిమీదికి పడవేసెను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసికొనకపోయెను.
యెహెజ్కేలు 30:3 – యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము.
యెహెజ్కేలు 34:12 – తమ గొఱ్ఱలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి
యోవేలు 2:2 – ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.
-of unsearchableness of God
2సమూయేలు 22:12 – గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింపజేసెను. నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.
కీర్తనలు 97:2 – మేఘాంధకారములు ఆయనచుట్టు నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.
యెహెజ్కేలు 1:4 – నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చుచుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతిదానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటిదొకటి కనబడెను.
– (Riding upon,) of the power and greatness of God
కీర్తనలు 104:3 – జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
యెషయా 19:1 – ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది
– (Passing away,) of the goodness and prosperity of hypocrites
హోషేయ 6:4 – ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమిచేతును? యూదా, నిన్ను నేనేమిచేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును.
హోషేయ 13:3 – కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.
– (Without water,) of false teachers
యూదా 1:12 – వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను,
– (Carried away by a tempest,) of false teachers
2పేతురు 2:17 – వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.
– (Without rain,) of the fraudulent
సామెతలు 25:14 – కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు.
– (A morning without,) of wise rulers
2సమూయేలు 23:3 – ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నాద్వారా మాటలాడుచున్నాడు. మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగి యేలును.
2సమూయేలు 23:4 – ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బు లేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలోనుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును.
– (When seasonable,) of the favour of good rulers
సామెతలు 16:15 – రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు.