Display Topic


Established by God

ద్వితియోపదేశాకాండము 4:5 – నా దేవుడైన యెహోవా నాకాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.

ద్వితియోపదేశాకాండము 4:6 – ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు.

ద్వితియోపదేశాకాండము 4:7 – ఏలయనగా మనము ఆయనకు మొఱపెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు?

ద్వితియోపదేశాకాండము 4:8 – మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలును నీతివిధులును గల గొప్ప జనమేది?

ద్వితియోపదేశాకాండము 4:9 – అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండునట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి

ద్వితియోపదేశాకాండము 4:10 – నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియుండగా యెహోవా నాయొద్దకు ప్రజలను కూర్చుము; వారు ఆ దేశముమీద బ్రదుకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమునుగూర్చి వారికి తెలుపుము.

ద్వితియోపదేశాకాండము 4:11 – అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశమువరకు అగ్నితో మండుచుండగా

ద్వితియోపదేశాకాండము 4:12 – యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి.

ద్వితియోపదేశాకాండము 4:13 – మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతిపలకలమీద వాటిని వ్రాసెను.

ద్వితియోపదేశాకాండము 4:14 – అప్పుడు మీరు నదిదాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నాకాజ్ఞాపించెను.

ద్వితియోపదేశాకాండము 26:18 – మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమైయుండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువనియు,

అపోస్తలులకార్యములు 7:35 – అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను

అపోస్తలులకార్యములు 7:38 – సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే.

Admission into, by circumcision

ఆదికాండము 17:10 – నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.

ఆదికాండము 17:11 – మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.

ఆదికాండము 17:12 – ఎనిమిది దినముల వయస్సు గలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.

ఆదికాండము 17:13 – నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును.

ఆదికాండము 17:14 – సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను.

All Israelites members of

రోమీయులకు 9:4 – వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.

Was relatively holy

నిర్గమకాండము 31:13 – మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును.

సంఖ్యాకాండము 16:3 – మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారిమధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,

Had

-An appointed place of worship

ద్వితియోపదేశాకాండము 12:5 – మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను.

-appointed ordinances

నిర్గమకాండము 18:20 – నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.

హెబ్రీయులకు 9:1 – మొదటి నిబంధనకైతే సేవానియమములును ఈ లోక సంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను.

హెబ్రీయులకు 9:10 – ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి.

-appointed feasts

లేవీయకాండము 23:2 – నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామక కాలములు ఇవి.

యెషయా 1:14 – మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలములును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

-An ordained ministry

నిర్గమకాండము 29:9 – అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతిష్టింపవలెను

ద్వితియోపదేశాకాండము 10:8 – నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను.

-the divine presence manifested in it

నిర్గమకాండము 29:45 – నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనైయుందును.

నిర్గమకాండము 29:46 – కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములోనుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.

లేవీయకాండము 26:11 – నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు.

లేవీయకాండము 26:12 – నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు.

1రాజులు 8:10 – యాజకులు పరిశుద్ధ స్థలములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను.

1రాజులు 8:11 – కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి.

-A spiritual Church within it

రోమీయులకు 9:6 – అయితే దేవునిమాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు.

రోమీయులకు 9:7 – అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును,

రోమీయులకు 9:8 – అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు.

రోమీయులకు 11:2 – తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?

రోమీయులకు 11:3 – ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.

రోమీయులకు 11:4 – అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.

రోమీయులకు 11:5 – ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలియున్నది.

రోమీయులకు 11:6 – అది కృపచేతనైనయెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.

రోమీయులకు 11:7 – ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కినవారు కఠినచిత్తులైరి.

In covenant with God

ద్వితియోపదేశాకాండము 4:13 – మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతిపలకలమీద వాటిని వ్రాసెను.

ద్వితియోపదేశాకాండము 4:23 – మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను.

అపోస్తలులకార్యములు 3:25 – ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.

The depository of holy writ

రోమీయులకు 3:2 – ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదులపరము చేయబడెను.

Called the

-congregation of Israel

నిర్గమకాండము 12:47 – ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.

లేవీయకాండము 4:13 – ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదముచేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరానిపని చేసి అపరాధులైనయెడల

-congregation of the Lord

సంఖ్యాకాండము 27:17 – వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.

సంఖ్యాకాండము 31:16 – ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగుబాటు చేయించినవారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా.

Privileges of

రోమీయులకు 9:4 – వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.

Proselytes admitted into

సంఖ్యాకాండము 9:14 – మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.

సంఖ్యాకాండము 15:15 – సంఘమునకు, అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ; అది మీ తర తరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును.

సంఖ్యాకాండము 15:29 – ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారి మధ్యను నివసించు పరదేశియేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను.

Supported by the people

నిర్గమకాండము 34:20 – గొఱ్ఱపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను, దాని విమోచింపనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను, నా సన్నిధిని వారు పట్టిచేతులతో కనబడవలదు.

ద్వితియోపదేశాకాండము 16:17 – వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించిన దీవెనచొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను.

Worship of, consisted in

-sacrifice

నిర్గమకాండము 10:25 – మోషే మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను.

లేవీయకాండము 1:2 – నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవుల మందలోనుండిగాని గొఱ్ఱల మందలోనుండిగాని మేకల మందలోనుండిగాని దానిని తీసికొనిరావలెను.

హెబ్రీయులకు 10:1 – ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయనేరవు.

-prayer

నిర్గమకాండము 24:11 – ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.

కీర్తనలు 5:7 – నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములో ప్రవేశించెదను నీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను

కీర్తనలు 95:6 – ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.

-praise

2దినవృత్తాంతములు 5:13 – వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాటకులును ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి.

2దినవృత్తాంతములు 30:21 – యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి.

– Reading God’s word

నిర్గమకాండము 24:7 – అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.

ద్వితియోపదేశాకాండము 31:11 – నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించునప్పుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను.

-Preaching

నెహెమ్యా 8:4 – అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠముమీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.

నెహెమ్యా 8:5 – అప్పుడు ఎజ్రా అందరికంటె ఎత్తుగా నిలువబడి జనులందరును చూచుచుండగా గ్రంథమును విప్పెను, విప్పగానే జనులందరు నిలువబడిరి.

Attachment of the Jews to

యోహాను 9:28 – అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;

యోహాను 9:29 – దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.

అపోస్తలులకార్యములు 6:11 – అప్పుడు వారు వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని

Members of

-Required to know its statutes

లేవీయకాండము 10:11 – యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

-Required to keeps its statutes

ద్వితియోపదేశాకాండము 16:12 – నీవు ఐగుప్తులో దాసుడవైయుండిన సంగతిని జ్ఞాపకము చేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను.

-Required to Attend its worship

నిర్గమకాండము 23:17 – సంవత్సరమునకు మూడుమారులు పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను.

-Separated from, while unclean

లేవీయకాండము 13:46 – ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.

లేవీయకాండము 15:31 – ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను.

సంఖ్యాకాండము 5:2 – ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతివానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతివానిని, పాళెములోనుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.

సంఖ్యాకాండము 5:3 – నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్టవలెను.

సంఖ్యాకాండము 5:4 – ఇశ్రాయేలీయులు ఆలాగు చేసిరి; పాళెము వెలుపలికి అట్టివారిని వెళ్లగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి.

-Excommunicated for heavy offences

సంఖ్యాకాండము 15:30 – అయితే దేశమందు పుట్టినవాడేగాని పరదేశియేగాని యెవడైనను సాహసించి పాపముచేసినయెడల

సంఖ్యాకాండము 15:31 – వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టివేయబడును; వాడు యెహోవా మాటను అలక్ష్యముచేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు.

సంఖ్యాకాండము 19:20 – అపవిత్రుడు పాపశుద్ధి చేసికొననియెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును; వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహారజలము వానిమీద ప్రోక్షింపబడలేదు; వాడు అపవిత్రుడు.

Persons excluded from

నిర్గమకాండము 12:48 – నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.

ద్వితియోపదేశాకాండము 23:1 – గాయమునొందిన వృషణములు గలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. కుండుడు యెహోవా సమాజములో చేరకూడదు.

ద్వితియోపదేశాకాండము 23:2 – వానికి పదియవ తరము వాడైనను యెహోవా సమాజములో చేరకూడదు.

ద్వితియోపదేశాకాండము 23:3 – అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.

ద్వితియోపదేశాకాండము 23:4 – ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి.

యెహెజ్కేలు 44:7 – ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగపరచిరి.

యెహెజ్కేలు 44:9 – కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా హృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులైయుండి ఇశ్రాయేలీయులమధ్య నివసించువారిలో ఎవడును నా పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.

A type of the church of Christ

గలతీయులకు 4:24 – ఈ సంగతులు అలంకారరూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.

గలతీయులకు 4:25 – ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది.

గలతీయులకు 4:26 – అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి.

హెబ్రీయులకు 12:23 – పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవునియొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలయొద్దకును,