Display Topic
Foretold
ద్వితియోపదేశాకాండము 18:15 – హోరేబులో ఆ సమాజదినమున నీవు నేను చావకయుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక,
ద్వితియోపదేశాకాండము 18:18 – వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటలనుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును.
యెషయా 52:7 – సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.
నహూము 1:15 – సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.
Anointed with the Holy Spirit
యెషయా 42:1 – ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.
యెషయా 61:1 – ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును
లూకా 4:18 – ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును
యోహాను 3:34 – ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలత లేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.
Alone knows and reveals God
మత్తయి 11:27 – సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడియున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
యోహాను 3:2 – అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను
యోహాను 3:13 – మరియు పరలోకమునుండి దిగి వచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.
యోహాను 3:34 – ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలత లేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.
యోహాను 17:6 – లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి; వారు నీ వాక్యము గైకొనియున్నారు.
యోహాను 17:14 – వారికి నీ వాక్యమిచ్చియున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును.
యోహాను 17:26 – నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదనని చెప్పెను.
హెబ్రీయులకు 1:1 – పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు
హెబ్రీయులకు 1:2 – ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
Declared his doctrine to be that of the Father
యోహాను 8:26 – మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.
యోహాను 8:28 – కావున యేసు మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.
యోహాను 12:49 – ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.
యోహాను 12:50 – మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను.
యోహాను 14:10 – తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు.
యోహాను 14:24 – నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే.
యోహాను 15:15 – దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.
యోహాను 17:8 – నీవు నాకు అనుగ్రహించినవన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు.
యోహాను 17:16 – నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.
Preached the gospel, and worked miracles
మత్తయి 4:23 – యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతట సంచరించెను.
మత్తయి 11:5 – గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
లూకా 4:43 – ఆయన నేనితర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను.
Foretold things to come
మత్తయి 24:3 – ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా
మత్తయి 24:4 – యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.
మత్తయి 24:5 – అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.
మత్తయి 24:6 – మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.
మత్తయి 24:7 – జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.
మత్తయి 24:8 – అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.
మత్తయి 24:9 – అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.
మత్తయి 24:10 – అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు.
మత్తయి 24:11 – అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;
మత్తయి 24:12 – అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.
మత్తయి 24:13 – అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.
మత్తయి 24:14 – మరియు ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.
మత్తయి 24:15 – కాబట్టి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక
మత్తయి 24:16 – యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను
మత్తయి 24:17 – మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకు దిగకూడదు;
మత్తయి 24:18 – పొలములో ఉండువాడు, తన బట్టలు తీసికొనిపోవుటకు ఇంటికి రాకూడదు.
మత్తయి 24:19 – అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.
మత్తయి 24:20 – అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.
మత్తయి 24:21 – లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.
మత్తయి 24:22 – ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
మత్తయి 24:23 – ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి.
మత్తయి 24:24 – అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
మత్తయి 24:25 – ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.
మత్తయి 24:26 – కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి
మత్తయి 24:27 – మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.
మత్తయి 24:28 – పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును.
మత్తయి 24:29 – ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.
మత్తయి 24:30 – అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకుందురు
మత్తయి 24:31 – మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.
మత్తయి 24:32 – అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును.
మత్తయి 24:33 – ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి.
మత్తయి 24:34 – ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 24:35 – ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.
లూకా 19:41 – ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి
లూకా 19:44 – నీలో రాతిమీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చునని చెప్పెను.
Faithful to his trust
లూకా 4:43 – ఆయన నేనితర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను.
యోహాను 17:8 – నీవు నాకు అనుగ్రహించినవన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు.
హెబ్రీయులకు 3:2 – దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయన కూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.
ప్రకటన 1:5 – నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
ప్రకటన 3:14 – లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా
Abounded in wisdom
లూకా 2:40 – బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.
లూకా 2:47 – ఆయన మాటలు వినిన వారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి.
లూకా 2:52 – యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లు చుండెను.
కొలొస్సయులకు 2:3 – బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.
Mighty in deed and word
మత్తయి 13:54 – అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతనికెక్కడనుండి వచ్చినవి?
మార్కు 1:27 – అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
లూకా 4:32 – ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి.
యోహాను 7:46 – ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి.
Meek and unostentatious in his teaching
యెషయా 42:2 – అతడు కేకలువేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు
మత్తయి 12:17 – ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు జరిగెను) అదేమనగా
మత్తయి 12:18 – ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.
మత్తయి 12:19 – ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు
మత్తయి 12:20 – విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు
God commands us to hear
ద్వితియోపదేశాకాండము 18:15 – హోరేబులో ఆ సమాజదినమున నీవు నేను చావకయుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక,
మత్తయి 17:25 – అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తి సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా? అని అడిగెను
అపోస్తలులకార్యములు 3:22 – మోషే యిట్లనెను ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.
అపోస్తలులకార్యములు 7:37 – నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే.
God will severely visit our neglect of
ద్వితియోపదేశాకాండము 18:19 – అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దానిగూర్చి విచారణ చేసెదను.
అపోస్తలులకార్యములు 3:23 – ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.
హెబ్రీయులకు 2:3 – ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,
Typified
-Moses
ద్వితియోపదేశాకాండము 18:15 – హోరేబులో ఆ సమాజదినమున నీవు నేను చావకయుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక,