Display Topic


To be without spot or blemish

సంఖ్యాకాండము 19:2 – యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొనిరావలెనని వారితో చెప్పుము.

To ge given to Eleazar the second priest to offer

సంఖ్యాకాండము 19:3 – మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలుకొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను.

To be slain without the camp

సంఖ్యాకాండము 19:3 – మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలుకొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను.

Entire of, to be burned

సంఖ్యాకాండము 19:5 – అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను, దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను.

Blood of, sprinkled seven times before the tabernacle

సంఖ్యాకాండము 19:4 – యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను;

Cedar, hyssop, burned with

సంఖ్యాకాండము 19:6 – మరియు ఆ యాజకుడు దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసికొని, ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను.

Ashes of, collected and mixed with water for purification

సంఖ్యాకాండము 19:9 – మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్రస్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను; అది పాపపరిహారార్థబలి.

సంఖ్యాకాండము 19:11 – ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.

సంఖ్యాకాండము 19:12 – అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసికొని యేడవ దినమున పవిత్రుడగును. అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసికొననియెడల ఏడవ దినమున పవిత్రుడు కాడు.

సంఖ్యాకాండము 19:13 – నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వానికుండును.

సంఖ్యాకాండము 19:14 – ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును.

సంఖ్యాకాండము 19:15 – మూతవేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును.

సంఖ్యాకాండము 19:16 – బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవమునైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.

సంఖ్యాకాండము 19:17 – అపవిత్రుని కొరకు వారు పాపపరిహారార్థమైన హోమభస్మములోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మముమీద ఒకడు పారు నీళ్లు పోయవలెను.

సంఖ్యాకాండము 19:18 – తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని ఆ నీళ్లలో ముంచి, ఆ గుడారముమీదను దానిలోని సమస్తమైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యులమీదను, ఎముకనేగాని నరకబడిన వానినేగాని శవమునేగాని సమాధినేగాని ముట్టినవానిమీదను దానిని ప్రోక్షింపవలెను.

సంఖ్యాకాండము 19:19 – మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రునిమీద దానిని ప్రోక్షింపవలెను. ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసికొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమున పవిత్రుడగును.

సంఖ్యాకాండము 19:20 – అపవిత్రుడు పాపశుద్ధి చేసికొననియెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును; వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహారజలము వానిమీద ప్రోక్షింపబడలేదు; వాడు అపవిత్రుడు.

సంఖ్యాకాండము 19:21 – వారికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాపపరిహారజలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను; పాపపరిహారజలమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును; అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము.

సంఖ్యాకాండము 19:22 – దాని ముట్టు మనుష్యులందరు సాయంకాలమువరకు అపవిత్రులై యుందురు.

Communicated uncleanness to

-the Priest That offered her

సంఖ్యాకాండము 19:7 – అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

-the Man That burned her

సంఖ్యాకాండము 19:8 – దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

-the Man who Gathered the ashes

సంఖ్యాకాండము 19:10 – ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ.

Could only purify the flesh

హెబ్రీయులకు 9:13 – ఏలయనగా మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,

A type of Christ

హెబ్రీయులకు 9:12 – మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

హెబ్రీయులకు 9:13 – ఏలయనగా మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,

హెబ్రీయులకు 9:14 – నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.