Display Topic


The sentence of God against sin

మత్తయి 25:41 – అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.

Universal, caused by the offence of Adam

రోమీయులకు 5:12 – ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.

రోమీయులకు 5:16 – మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.

రోమీయులకు 5:18 – కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.

Inseparable consequence of sin

సామెతలు 12:2 – సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును.

రోమీయులకు 6:23 – ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.

Increased by

-Impenitence

మత్తయి 11:20 – పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను.

మత్తయి 11:21 – అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొందియుందురు

మత్తయి 11:22 – విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.

మత్తయి 11:23 – కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినయెడల అది నేటివరకు నిలిచియుండును.

మత్తయి 11:24 – విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.

-Unbelief

యోహాను 3:18 – ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.

యోహాను 3:19 – ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

-Pride

1తిమోతి 3:6 – అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు.

-Oppression

యాకోబు 5:1 – ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి.

యాకోబు 5:2 – మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.

యాకోబు 5:3 – మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి.

యాకోబు 5:4 – ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.

యాకోబు 5:5 – మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.

-Hypocrisy

మత్తయి 23:14 – మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించువారిని ప్రవేశింపనియ్యరు.

Conscience testifies to the justice of

యోబు 9:20 – నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.

రోమీయులకు 2:1 – కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?

తీతుకు 3:11 – అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు.

The law testifies to the justice of

రోమీయులకు 3:19 – ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పుచున్నదని యెరుగుదుము.

According to men’s deserts

మత్తయి 12:37 – నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

2కొరిందీయులకు 11:15 – గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారికంతము కలుగును.

Saints are delivered from, by Christ

యోహాను 3:18 – ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.

యోహాను 5:24 – నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

రోమీయులకు 8:1 – కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.

రోమీయులకు 8:33 – దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే;

రోమీయులకు 8:34 – శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతేకాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే

Of the wicked, an example

2పేతురు 2:7 – దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.

యూదా 1:7 – ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.

Chastisements are designed to rescue us from

కీర్తనలు 94:12 – యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమునుబట్టి నీవు బోధించువాడు ధన్యుడు.

కీర్తనలు 94:13 – భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు.

1కొరిందీయులకు 11:32 – మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.

Apostates ordained to

యూదా 1:4 – ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.

Unbelievers remain under

యోహాను 3:18 – ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.

యోహాను 3:36 – కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును.

The law is the ministration of

2కొరిందీయులకు 3:9 – శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ కలదగును.